(॥పల్లవి॥)
నిజమాడరా నాతో నీకు నీవే
బజనచెడ్డవలవు పనిలేదురా
(॥॥)
అరయ నామీఁదితలఁ పంతనీ కున్నదా
వరుస వంతుకు నేనేవచ్చేఁగాక
సరసమాడేయందు చవిగద్దా నామీఁద
వొరసిన నాచేతివొత్తులుగాక
(॥॥)
వసమా నాకు నీవు వద్ద నుండి వూరకైనా
అసముదించనిమాట లాడేఁగాక
సుసరమా నీపొందు సుదతు లిందరిలోన
కసుగాటు నీవలపు కైకొనేఁగాక
(॥॥)
ఆరీతి నాపై తమక మంత నీకుఁ గలదా
గోరపెట్టి నిన్ను నేనే కూడేఁగాక
నేరిచి యానవెట్టేవు నీవు నాపై మోహమంటా
యేరా శ్రీ వేంకటేశ యియ్యకొంటిలేరా
(||pallavi||)
nijamāḍarā nādo nīgu nīve
bajanasĕḍḍavalavu paniledurā
(||||)
araya nāmīm̐didalam̐ paṁtanī kunnadā
varusa vaṁtugu nenevachchem̐gāga
sarasamāḍeyaṁdu savigaddā nāmīm̐da
vŏrasina nāsedivŏttulugāga
(||||)
vasamā nāgu nīvu vadda nuṁḍi vūragainā
asamudiṁchanimāḍa lāḍem̐gāga
susaramā nībŏṁdu sudadu liṁdarilona
kasugāḍu nīvalabu kaigŏnem̐gāga
(||||)
ārīdi nābai tamaga maṁta nīgum̐ galadā
gorabĕṭṭi ninnu nene kūḍem̐gāga
nerisi yānavĕṭṭevu nīvu nābai mohamaṁṭā
yerā śhrī veṁkaḍeśha yiyyagŏṁṭilerā