Nija maadidem ganaga neeve naadevaravu

నిజ మాడితేఁ గనక నీవే నాదేవరవు
Language

(॥పల్లవి॥)
నిజ మాడితేఁ గనక నీవే నాదేవరవు
గజరు నీచేఁతలకుఁ గలఁగీ నా చిత్తము

(॥నిజ॥)
యిందరు వినఁగ నిన్ను యెందు వోతి వంటిఁ గాక
నింద లే మైన నీకు నేఁ గట్టితినా
కందువ యింత గలితే గడించుకొదువు నీవు
అందుకె పో నిన్నుఁ గంటే నదరీ నామేను

(॥నిజ॥)
యింతు ల్లెల్లఁ జూడగాను యిట్టట్టు రమ్మంటి గాక
వింతగురుతులు నీమై వెదకితినా
కాంతలఁ గంటేఁ జాలు కాకు సేయ నేరుతువు
యెంతైన నిందుకె మాఁట యియ్యకొనఁ జాలను

(॥నిజ॥)
నీ సతుల ముందరనె నే నిటు నవ్వితిఁ గాక
సేస వెట్టి నిన్నుర గేలి సేసితినా
ఆల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
వేసరక యిందుకె పో వేఁడుకొందు నిన్నును

(||pallavi||)
nija māḍidem̐ ganaga nīve nādevaravu
gajaru nīsem̐talagum̐ galam̐gī nā sittamu

(||nija||)
yiṁdaru vinam̐ga ninnu yĕṁdu vodi vaṁṭim̐ gāga
niṁda le maina nīgu nem̐ gaṭṭidinā
kaṁduva yiṁta galide gaḍiṁchugŏduvu nīvu
aṁdugĕ po ninnum̐ gaṁṭe nadarī nāmenu

(||nija||)
yiṁtu llĕllam̐ jūḍagānu yiṭṭaṭṭu rammaṁṭi gāga
viṁtagurudulu nīmai vĕdagidinā
kāṁtalam̐ gaṁṭem̐ jālu kāgu seya neruduvu
yĕṁtaina niṁdugĕ mām̐ṭa yiyyagŏnam̐ jālanu

(||nija||)
nī sadula muṁdaranĕ ne niḍu navvidim̐ gāga
sesa vĕṭṭi ninnura geli sesidinā
āla śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
vesaraga yiṁdugĕ po vem̐ḍugŏṁdu ninnunu