Nigidi nem gamtimgaa nee saridalellaanu

నిగిడి నేఁ గంటిఁగా నీ సరితలెల్లాను
Language

(॥పల్లవి॥)
నిగిడి నేఁ గంటిఁగా నీ సరితలెల్లాను
ముగురెరిఁగిన పని మూఁడులోకా లెఱుఁగు

(॥॥)
వరుస నాపెఇంటికి వచ్చేనని నీవు రాఁగా
గొరబుగా నొకతే నీకొంగు వట్టెను
యెరువులవాఁడవై యేమని బొంకఁగలవు
వెరవున నాకె ఇందు వెదక వచ్చినను

(॥॥)
వింతగాఁ దొల్లిటాపెకు విడెము నీవంపఁగాను
అంతలోనే యీకె వచ్చి అందుకొనెను
బంతి నుండి యెట్టు వొడఁబరచఁగ నేరుతువు
యింతలో నాకె దెలసి యీడకు వచ్చినను

(॥॥)
అప్పటాపెఁ బేరుకొని అట్టె నీవు విలువఁగా
వొప్పుగా నడుమ నీకె వూఁకొనెను
చిప్పి లలమేల్మంగను శ్రీ వేంకటేశ యేలితిఁ
విప్పు డాకె వచ్చితేను యిందరిఁ గూడితివి

(||pallavi||)
nigiḍi nem̐ gaṁṭim̐gā nī saridalĕllānu
mugurĕrim̐gina pani mūm̐ḍulogā lĕṟum̐gu

(||||)
varusa nābĕiṁṭigi vachchenani nīvu rām̐gā
gŏrabugā nŏgade nīgŏṁgu vaṭṭĕnu
yĕruvulavām̐ḍavai yemani bŏṁkam̐galavu
vĕravuna nāgĕ iṁdu vĕdaga vachchinanu

(||||)
viṁtagām̐ dŏlliḍābĕgu viḍĕmu nīvaṁpam̐gānu
aṁtalone yīgĕ vachchi aṁdugŏnĕnu
baṁti nuṁḍi yĕṭṭu vŏḍam̐barasam̐ga neruduvu
yiṁtalo nāgĕ dĕlasi yīḍagu vachchinanu

(||||)
appaḍābĕm̐ berugŏni aṭṭĕ nīvu viluvam̐gā
vŏppugā naḍuma nīgĕ vūm̐kŏnĕnu
sippi lalamelmaṁganu śhrī veṁkaḍeśha yelidim̐
vippu ḍāgĕ vachchidenu yiṁdarim̐ gūḍidivi