నిచ్చనిచ్చఁ జేకొను నివాళి
(॥పల్లవి॥)
నిచ్చనిచ్చఁ జేకొను నివాళి
యిచ్చఁ బేరెవర మోబుళేళ నివాళి
(॥నిచ్చ॥)
సొలపులవాలుకచూపుల నెత్తేరు
నెలఁతలు నీకిదె నివాళి
నలయపు కంకణరవంబుల నెత్తేరు
నిలువుఁ బయ్యదల నివాళి
(॥నిచ్చ॥)
గక్కనను సరసపుకప్పురపునవ్వుల
నిక్కుచు నెత్తేరు నీకు నివాళి
వక్కణించ మాణికపువన్నెగోళ్ల చేతుల
నెక్కొని నెత్తేరు నీకు నివాళి
(॥నిచ్చ॥)
ముంచినకాఁగిటిలో నీ మోహనవేదమంత్రాల
నించినించి యెత్తేరు నివాళి
పెంచపు శ్రీవేంకటాద్రి పేరెవరపోబు ళేళ
అంచె నిన్నుఁ గూడి యెత్తే రదే నివాళి
(||pallavi||)
nichchanichcham̐ jegŏnu nivāḽi
yichcham̐ berĕvara mobuḽeḽa nivāḽi
(||nichcha||)
sŏlabulavālugasūbula nĕtteru
nĕlam̐talu nīgidĕ nivāḽi
nalayabu kaṁkaṇaravaṁbula nĕtteru
niluvum̐ bayyadala nivāḽi
(||nichcha||)
gakkananu sarasabugappurabunavvula
nikkusu nĕtteru nīgu nivāḽi
vakkaṇiṁcha māṇigabuvannĕgoḽla sedula
nĕkkŏni nĕtteru nīgu nivāḽi
(||nichcha||)
muṁchinagām̐giḍilo nī mohanavedamaṁtrāla
niṁchiniṁchi yĕtteru nivāḽi
pĕṁchabu śhrīveṁkaḍādri perĕvarabobu ḽeḽa
aṁchĕ ninnum̐ gūḍi yĕtte rade nivāḽi