నిచ్చనిచ్చ వాదులేల నీచిత్తము
(॥పల్లవి॥)
నిచ్చనిచ్చ వాదులేల నీచిత్తము
యెచ్చుకుందు లాడనేల యింకా నీచిత్తము
(॥॥)
మిక్కిలిదొరవు నీతో మేలమాడ వెఱతుము
నిక్కి నీవేమి సేసినా నీచి త్తము
యెక్కువతక్కువ నీతో నేమంటే నేమవునో
మొక్కితిమి నీకు నేము ముందర నీచిత్తము
(॥॥)
కమ్మరఁ గమ్మర నీపైఁ గల్ల మోప నోపము
నిమ్మపండు గానుకిదే నీచిత్తము
సమ్మతిగా నీవలపు చల్లఁబోతే చవిగాదు
వుమ్మడి నుండే మింక నున్నది నీచిత్తము
(॥॥)
చేవదేర నీయెడకు సిగ్గువడ నిఁకనేల
నీవే నేనైతి నిఁక నీచిత్తము
శ్రీ వేంకటేశ నన్నుఁ జేకొని కూడితి విట్టె
కైవశమైతి మిఁకఁ గలది నీచిత్తము
(||pallavi||)
nichchanichcha vādulela nīsittamu
yĕchchuguṁdu lāḍanela yiṁkā nīsittamu
(||||)
mikkilidŏravu nīdo melamāḍa vĕṟadumu
nikki nīvemi sesinā nīsi ttamu
yĕkkuvadakkuva nīdo nemaṁṭe nemavuno
mŏkkidimi nīgu nemu muṁdara nīsittamu
(||||)
kammaram̐ gammara nībaim̐ galla moba nobamu
nimmabaṁḍu gānugide nīsittamu
sammadigā nīvalabu sallam̐bode savigādu
vummaḍi nuṁḍe miṁka nunnadi nīsittamu
(||||)
sevadera nīyĕḍagu sigguvaḍa nim̐kanela
nīve nenaidi nim̐ka nīsittamu
śhrī veṁkaḍeśha nannum̐ jegŏni kūḍidi viṭṭĕ
kaivaśhamaidi mim̐kam̐ galadi nīsittamu