నిచ్చనిచ్చ సోబనాలు నెల మూఁడు సోబనాలు
(॥పల్లవి॥)
నిచ్చనిచ్చ సోబనాలు నెల మూఁడు సోబనాలు
హెచ్చె నీకు నింతలోనె ఇవి గదవయ్యా
(॥నిచ్చ॥)
చెలియమోహములే సేసపాలు
పెలుచుసిగ్గులే మీకు పెండ్లితెర
కలగొనుచూపులే కంకణాలు
సులభాన నీకు నబ్బె సుఖియించవయ్యా
(॥నిచ్చ॥)
మగువ మాటలే నీకు మంత్రాలు
పొగరుమోవితేనెలే బువ్వాలు
వెగటుబొమ్మజంకెలే విడేలు
జిగి నీకు నేఁ డబ్బెఁ జిత్తగించవయ్యా
(॥నిచ్చ॥)
కాంతసరసములే కప్పురాలు
పొంతనున్నకుచములే బూఁజకుండలు
చెంతలఁ గూడితి విట్టే శ్రీవేంకటేశా యివి
సంతసమాయను నీకు జయమందవయ్యా
(||pallavi||)
nichchanichcha sobanālu nĕla mūm̐ḍu sobanālu
hĕchchĕ nīgu niṁtalonĕ ivi gadavayyā
(||nichcha||)
sĕliyamohamule sesabālu
pĕlususiggule mīgu pĕṁḍlidĕra
kalagŏnusūbule kaṁkaṇālu
sulabhāna nīgu nabbĕ sukhiyiṁchavayyā
(||nichcha||)
maguva māḍale nīgu maṁtrālu
pŏgarumovidenĕle buvvālu
vĕgaḍubŏmmajaṁkĕle viḍelu
jigi nīgu nem̐ ḍabbĕm̐ jittagiṁchavayyā
(||nichcha||)
kāṁtasarasamule kappurālu
pŏṁtanunnagusamule būm̐jaguṁḍalu
sĕṁtalam̐ gūḍidi viṭṭe śhrīveṁkaḍeśhā yivi
saṁtasamāyanu nīgu jayamaṁdavayyā