నిచ్చఁబండుగలు సేసీ నెలఁత ఇదివో నేఁడు
(॥పల్లవి॥)
నిచ్చఁబండుగలు సేసీ నెలఁత ఇదివో నేఁడు
తచ్చిన పులక పూవుదండలతోను
(॥నిచ్చ॥)
కన్నులపండుగ సేసెఁ గాంత నిన్నుఁ గనుఁగొని
సన్నపునునుఁ జెమటజలకాలతో
విన్ననైన తరితీపువిందుల కజ్జాయముతో
కన్నెలెల్ల నీనవ్వులకప్పురాలతోను
(॥నిచ్చ॥)
వీనులపండుగ సేసె వెలఁది నీపేరు విని
ఆనకపుఁ గూరిమిగంధాక్షలతో
కానుకైనర మదరాగముల విడేలతో
సేనల సిగ్గులవింత చిలుపాలతోను
(॥నిచ్చ॥)
కాఎగిటిపండుగసేసె కామిని నీకూటముల
వాఎగేటివూర్పుల మోఎత వాద్యాలతో
రాఎగిన శ్రీవేంకటేశ రతులభోగములతో
సాగినసరసముల సంతసాలతోను
(||pallavi||)
nichcham̐baṁḍugalu sesī nĕlam̐ta idivo nem̐ḍu
tachchina pulaga pūvudaṁḍaladonu
(||nichcha||)
kannulabaṁḍuga sesĕm̐ gāṁta ninnum̐ ganum̐gŏni
sannabununum̐ jĕmaḍajalagālado
vinnanaina taridībuviṁdula kajjāyamudo
kannĕlĕlla nīnavvulagappurāladonu
(||nichcha||)
vīnulabaṁḍuga sesĕ vĕlam̐di nīberu vini
ānagabum̐ gūrimigaṁdhākṣhalado
kānugainara madarāgamula viḍelado
senala siggulaviṁta silubāladonu
(||nichcha||)
kǣgiḍibaṁḍugasesĕ kāmini nīgūḍamula
vǣgeḍivūrbula moĕda vādyālado
rǣgina śhrīveṁkaḍeśha radulabhogamulado
sāginasarasamula saṁtasāladonu