నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది । నీ
(॥పల్లవి॥)
నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది । నీ-
యిచ్చవచ్చినట్టు సేయు మెదురాడ నిఁకను
(॥నిచ్చ॥)
పలికితి నీతోడఁ బంతములు సారెసారె
సొలసితిఁ గొంత గొంత చూపులలోను
అలసితి నిఁకనోప నన్నిటా నీచిత్తమునఁ
గలిగినయట్లఁ జేయు కాదన నే నిఁకను
(॥నిచ్చ॥)
కక్కసించితిని నిన్ను ఘనమైనరతులను
వెక్కసానఁ గొసరితి వేసరించితి
మొక్కెద నిఁక నేనేర మొదల నుపాయాలు
మక్కువ గలట్టే సేయు మఱఁగేల యిఁకను
(॥నిచ్చ॥)
కరఁగించితి మనసు కాఁగిటిరతుల నిన్ను
సిరుల శ్రీవేంకటేశ సేవచేసితి
అరమఱచితి: నవ్వే నలమేలుమంగ నేను
తరవాత నన్నీఁ జేయు తమకించ నిఁకను
(||pallavi||)
nichchalu nābadugĕlla nīsedidi | nī-
yichchavachchinaṭṭu seyu mĕdurāḍa nim̐kanu
(||nichcha||)
paligidi nīdoḍam̐ baṁtamulu sārĕsārĕ
sŏlasidim̐ gŏṁta gŏṁta sūbulalonu
alasidi nim̐kanoba nanniḍā nīsittamunam̐
galiginayaṭlam̐ jeyu kādana ne nim̐kanu
(||nichcha||)
kakkasiṁchidini ninnu ghanamainaradulanu
vĕkkasānam̐ gŏsaridi vesariṁchidi
mŏkkĕda nim̐ka nenera mŏdala nubāyālu
makkuva galaṭṭe seyu maṟam̐gela yim̐kanu
(||nichcha||)
karam̐giṁchidi manasu kām̐giḍiradula ninnu
sirula śhrīveṁkaḍeśha sevasesidi
aramaṟasidi: navve nalamelumaṁga nenu
taravāda nannīm̐ jeyu tamagiṁcha nim̐kanu