నిచ్చలు నా పుణ్యము నీ చేతిది
(॥పల్లవి॥)
నిచ్చలు నా పుణ్యము నీ చేతిది
మచ్చరపుదానఁ గాను మరి యేఁటిమాటలు
(॥నిచ్చ॥)
పంతమాడి నీతోను పచ్చిగా నే వలచితి
యెంతసేసినా నీచిత్త మేమనే నిన్ను
దొంతులాయఁ గోరికలు దొమ్మిసేసెఁ దమకము
మంతుకెక్కె నావయసు మరియేఁటిమాటలు
(॥నిచ్చ॥)
చలపట్టి నీతోను సలిగెకే పెనఁగితి
యెలమి నీదయే మాకు యేమనే నిన్ను
నిలువెల్ల జెమరించె నిండె నీపైఁ జూపులు
మలసీ నీతల పోఁత మరి యేఁటిమాటలు
(॥నిచ్చ॥)
కొంగువట్టి నీకాఁగిటఁ గూడితి శ్రీ వేంకటేశ
యెంగిలిసేసితి మోవి యేమనే నిన్ను
వుంగరము నాచేఁ జిక్కె వొక్కటాయ నామనసు
మంగళాలన్నియుఁ జేరె మరియేఁటిమాటలు
(||pallavi||)
nichchalu nā puṇyamu nī sedidi
machcharabudānam̐ gānu mari yem̐ṭimāḍalu
(||nichcha||)
paṁtamāḍi nīdonu pachchigā ne valasidi
yĕṁtasesinā nīsitta memane ninnu
dŏṁtulāyam̐ gorigalu dŏmmisesĕm̐ damagamu
maṁtugĕkkĕ nāvayasu mariyem̐ṭimāḍalu
(||nichcha||)
salabaṭṭi nīdonu saligĕge pĕnam̐gidi
yĕlami nīdaye māgu yemane ninnu
niluvĕlla jĕmariṁchĕ niṁḍĕ nībaim̐ jūbulu
malasī nīdala pom̐ta mari yem̐ṭimāḍalu
(||nichcha||)
kŏṁguvaṭṭi nīgām̐giḍam̐ gūḍidi śhrī veṁkaḍeśha
yĕṁgilisesidi movi yemane ninnu
vuṁgaramu nāsem̐ jikkĕ vŏkkaḍāya nāmanasu
maṁgaḽālanniyum̐ jerĕ mariyem̐ṭimāḍalu