Nichchagalyaanamulella neeyillu nimde

నిచ్చకల్యాణములెల్ల నీయిల్లు నిండె
Language

(॥పల్లవి॥)
నిచ్చకల్యాణములెల్ల నీయిల్లు నిండె
తచ్చి యప్పటి నన్నేల తడవేవయ్యా

(॥నిచ్చ॥)
చెప్పఁజెప్పఁ గొత్తలాయ చెలులకు నీవలపు
ముప్పిరిఁ జనుఁగొండలు మోపులాయను
రెప్పలెత్తి చూడఁ జూడ రేఁపులాయఁ దమకము
చోప్పులెత్తి చూపరాదు చూతువురావయ్యా

(॥నిచ్చ॥)
పట్టినదే పంతమాయ పచ్చిదేరె నీపొందు
గుట్టున మోవితేనెలు గుక్కిళ్లాయను
వొట్టిన సెలవినవ్వు లూరనూర నూటలాయ
చుట్టరిక మేమిచెప్పేఁ జూతువు రావయ్యా

(॥నిచ్చ॥)
అంటుకోనేజిగురాయ నందపునీకాగిలి
జంటలయారతులాయ చల్లుఁ జూపులు
ఇంటియలమేలుమంగను యేను శ్రీవేంకటేశుఁడ
సోంటు లెమిసోదించేవు చూతువు రావయ్యా

(||pallavi||)
nichchagalyāṇamulĕlla nīyillu niṁḍĕ
tachchi yappaḍi nannela taḍavevayyā

(||nichcha||)
sĕppam̐jĕppam̐ gŏttalāya sĕlulagu nīvalabu
muppirim̐ janum̐gŏṁḍalu mobulāyanu
rĕppalĕtti sūḍam̐ jūḍa rem̐pulāyam̐ damagamu
soppulĕtti sūbarādu sūduvurāvayyā

(||nichcha||)
paṭṭinade paṁtamāya pachchiderĕ nībŏṁdu
guṭṭuna movidenĕlu gukkiḽlāyanu
vŏṭṭina sĕlavinavvu lūranūra nūḍalāya
suṭṭariga memisĕppem̐ jūduvu rāvayyā

(||nichcha||)
aṁṭugonejigurāya naṁdabunīgāgili
jaṁṭalayāradulāya sallum̐ jūbulu
iṁṭiyalamelumaṁganu yenu śhrīveṁkaḍeśhum̐ḍa
soṁṭu lĕmisodiṁchevu sūduvu rāvayyā