(॥పల్లవి॥)
నిచ్చా జగడమేల నీ వెఱఁగవా
యిచ్చట నీమేన నవే యియ్యకోరాదా
(॥॥)
తప్పనిబొంకనిమాఁట తలఁపు లోపలితీఁట
నెప్పున నే నాడనేల నీ వెఱఁగవా
కప్పురవిడెముకాఁక కమ్మఁబులకలమూఁక
చొప్పునవట్టిచ్చీ నద్దము చూచుకోరాదా
(॥॥)
చుక్కలు నిండిమోవి సొలపుఁగన్నులకావి
నిక్కమౌత కల్లవుత నీవెఱఁగవా
ముక్కున నీబుసకొట్టు ముసిముసినవ్వులగుట్టు
దిక్కులవారి నడిగి తెలుసుకోరాదా
(॥॥)
వుబ్బునఁజేసినచేఁత వొడలిపై గోరివాఁత
నిబ్బరపు రతివేళ నీవెఱఁగవా
గొబ్బున శ్రీవెంకటేశ కూడితివి నన్ను నిట్టె
తబ్బిబ్బు తడఁబాట్లు దాఁచుకోరాదా
(||pallavi||)
nichchā jagaḍamela nī vĕṟam̐gavā
yichchaḍa nīmena nave yiyyagorādā
(||||)
tappanibŏṁkanimām̐ṭa talam̐pu lobalidīm̐ṭa
nĕppuna ne nāḍanela nī vĕṟam̐gavā
kappuraviḍĕmugām̐ka kammam̐bulagalamūm̐ka
sŏppunavaṭṭichchī naddamu sūsugorādā
(||||)
sukkalu niṁḍimovi sŏlabum̐gannulagāvi
nikkamauda kallavuda nīvĕṟam̐gavā
mukkuna nībusagŏṭṭu musimusinavvulaguṭṭu
dikkulavāri naḍigi tĕlusugorādā
(||||)
vubbunam̐jesinasem̐ta vŏḍalibai gorivām̐ta
nibbarabu radiveḽa nīvĕṟam̐gavā
gŏbbuna śhrīvĕṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
tabbibbu taḍam̐bāṭlu dām̐sugorādā