Nichcha nichchaa naa badugu neesedidi

నిచ్చ నిచ్చా నా బదుకు నీచేతిది
Language

(॥పల్లవి॥)
నిచ్చ నిచ్చా నా బదుకు నీచేతిది
యిచ్చకమై యెందుకైనా నియ్యకొందు నేనూ

(॥నిచ్చ॥)
చెక్కు నొక్కినందుకె సేద దేరితిఁ గాక
వెక్కసపుఁజింతతోడ వేగించనా
గుక్కక నీ చేఁతలకు గోపము వచ్చునంతలో
పక్కన వేఁడు కోంటేను పైపై లో నౌదును

(॥నిచ్చ॥)
చేయి వేసినందుకె సెలవి నవ్వితిఁ గాక
చాయ సేసుక బొమ్మల జంకించనా
మాయపు నీ గుణాలను మారుకొందు నంతలోనె
ఆయములు నీ వంటితే నన్నియు మఱతును

(॥నిచ్చ॥)
కాఁగిలించుకొన్నందుకె కళల మించితిఁ గాక
చేఁగ దేఁర దల వంచి చెమరించనా
కాఁగి మాటల దూరుదు కరఁగుదు నంతలోనె
ఆఁగి శ్రీవెంకటేశ నిన్నలమి నే మెత్తును

(||pallavi||)
nichcha nichchā nā badugu nīsedidi
yichchagamai yĕṁdugainā niyyagŏṁdu nenū

(||nichcha||)
sĕkku nŏkkinaṁdugĕ seda deridim̐ gāga
vĕkkasabum̐jiṁtadoḍa vegiṁchanā
gukkaga nī sem̐talagu gobamu vachchunaṁtalo
pakkana vem̐ḍu koṁṭenu paibai lo naudunu

(||nichcha||)
seyi vesinaṁdugĕ sĕlavi navvidim̐ gāga
sāya sesuga bŏmmala jaṁkiṁchanā
māyabu nī guṇālanu mārugŏṁdu naṁtalonĕ
āyamulu nī vaṁṭide nanniyu maṟadunu

(||nichcha||)
kām̐giliṁchugŏnnaṁdugĕ kaḽala miṁchidim̐ gāga
sem̐ga dem̐ra dala vaṁchi sĕmariṁchanā
kām̐gi māḍala dūrudu karam̐gudu naṁtalonĕ
ām̐gi śhrīvĕṁkaḍeśha ninnalami ne mĕttunu