Ni nnanamga dosamuraa neegu saaja mee gunamu

ని న్ననఁగ దోసమురా నీకు సాజ మీ గుణము
Language

(॥పల్లవి॥)
ని న్ననఁగ దోసమురా నీకు సాజ మీ గుణము
యిన్నిటా నా మొగమోటే యింత దెచ్చె నాకు

(॥నిన్ననగ॥)
కక్కసించి పెనఁగేవు కటారికాఁ డవా వోరి
వొక్కమాఁటె యింతయితే నోపరా నేను
యెక్కు వైన సటకాఁడ వెవ్వ రిచ్చి రీ బిగువు
మొక్కలపువలపులు మొన లాయ నాకు

(॥నిన్ననగ॥)
అడ్డగించు కొంటివి నా కప్పులవాఁడవా వోరి
గొడ్డేరు నీ కొద్ది కాదు కోపము నాకు
యెడ్డతనాలనె తొల్లి యెందరి భ్రమయించితి
వడ్డితో నా నవ్వులె పై వచ్చెరా నాకు

(॥నిన్ననగ॥)
కూరిమిఁ గాలు చాఁచేవు కొనుకొంటివా వోరి
వూరకె పతికిఁ బతి వోపనా నేను
వేరు లేక నన్నును శ్రీవెంకటేశ కూడితివి
మేరతో నింత నోమితి మేలురా నాకు

(||pallavi||)
ni nnanam̐ga dosamurā nīgu sāja mī guṇamu
yinniḍā nā mŏgamoḍe yiṁta dĕchchĕ nāgu

(||ninnanaga||)
kakkasiṁchi pĕnam̐gevu kaḍārigām̐ ḍavā vori
vŏkkamām̐ṭĕ yiṁtayide nobarā nenu
yĕkku vaina saḍagām̐ḍa vĕvva richchi rī biguvu
mŏkkalabuvalabulu mŏna lāya nāgu

(||ninnanaga||)
aḍḍagiṁchu kŏṁṭivi nā kappulavām̐ḍavā vori
gŏḍḍeru nī kŏddi kādu kobamu nāgu
yĕḍḍadanālanĕ tŏlli yĕṁdari bhramayiṁchidi
vaḍḍido nā navvulĕ pai vachchĕrā nāgu

(||ninnanaga||)
kūrimim̐ gālu sām̐sevu kŏnugŏṁṭivā vori
vūragĕ padigim̐ badi vobanā nenu
veru lega nannunu śhrīvĕṁkaḍeśha kūḍidivi
merado niṁta nomidi melurā nāgu