నెట్టుకొన్న బత్తితోడ నీవు నేను వుండఁగాను
(॥పల్లవి॥)
నెట్టుకొన్న బత్తితోడ నీవు నేను వుండఁగాను
చుట్టమై తానూ నిన్ను సొలయజూచీని
(॥నెట్టు॥)
వలిపె పయ్యెద వల్లెవాటుతోడ నిలుచుండి
నెలఁత తొంగిచూచీని నిన్ను నిదివో
నలువంకఁ గమ్మవాసనలు బుగులు కొనఁగా
చలువగా సురటి విసరు కొనీఁ దాను
(॥నెట్టు॥)
దంతకాంతులు సెలవిఁ దళుకున మెరువఁగా
ఇంతి నిన్ను పిలిచీని యెలయింపుడ
రంతులుగాఁ గంకణాలు రాసి రాసి మొరయఁగా
చెంత నిదె మొక్కీని చేతులెత్తి నీకు
(॥నెట్టు॥)
తురుము చెంగలువలు తొట తొట రాలఁగాను
తరుణి నిన్ను వేసీని తామరలను
ఇరవై శ్రీవేంకటేశ ఇంతలోఁ గాఁగిలించితి
వరిది నీమోవితేనె లానీఁ దానిపుడు
(||pallavi||)
nĕṭṭugŏnna battidoḍa nīvu nenu vuṁḍam̐gānu
suṭṭamai tānū ninnu sŏlayajūsīni
(||nĕṭṭu||)
valibĕ payyĕda vallĕvāḍudoḍa nilusuṁḍi
nĕlam̐ta tŏṁgisūsīni ninnu nidivo
naluvaṁkam̐ gammavāsanalu bugulu kŏnam̐gā
saluvagā suraḍi visaru kŏnīm̐ dānu
(||nĕṭṭu||)
daṁtagāṁtulu sĕlavim̐ daḽuguna mĕruvam̐gā
iṁti ninnu pilisīni yĕlayiṁpuḍa
raṁtulugām̐ gaṁkaṇālu rāsi rāsi mŏrayam̐gā
sĕṁta nidĕ mŏkkīni sedulĕtti nīgu
(||nĕṭṭu||)
turumu sĕṁgaluvalu tŏḍa tŏḍa rālam̐gānu
taruṇi ninnu vesīni tāmaralanu
iravai śhrīveṁkaḍeśha iṁtalom̐ gām̐giliṁchidi
varidi nīmovidenĕ lānīm̐ dānibuḍu