Nettugoni mannimchedi neesedi dimtegaaga

నెట్టుకొని మన్నించేది నీచేతి దింతేకాక
Language

(॥పల్లవి॥)
నెట్టుకొని మన్నించేది నీచేతి దింతేకాక
బట్టబయ లీఁదించఁగా భ్రమసే దేమరుదు

(॥॥)
వెలలేనిమాటలు వేవేలు నీ వాడఁ గాను
వలవకుందురా యెట్టివనితలై నా
యెలమిఁ జక్కఁదనాలు యెదుటనే చూపఁగాను
బలిమి జవ్వనులెల్లా భ్రమసే దేమరుదు

(॥॥)
పురిగొని నీ వేపొద్దు పొరుగున నుండఁగాను
మరుగకుందురా గొల్లమంకులై నా
ఇరవైనచుట్టమవు ఇక్కువలు ముట్టగాను
పరిపరివిధముల భ్రమసే దేమరుదు

(॥॥)
కడు నీవు బుజ్జగించి కాగిలించుకొనఁగాను
అడరి చొక్కుకుందురా అచ్చరవైనా
నడుచు శ్రీవేంకటేశ నన్ను నిట్టె కూడితివి
బడి నిన్నుఁ జూచేవారు భ్రమసే దేమరుదు

(||pallavi||)
nĕṭṭugŏni manniṁchedi nīsedi diṁtegāga
baṭṭabaya līm̐diṁcham̐gā bhramase demarudu

(||||)
vĕlalenimāḍalu vevelu nī vāḍam̐ gānu
valavaguṁdurā yĕṭṭivanidalai nā
yĕlamim̐ jakkam̐danālu yĕduḍane sūbam̐gānu
balimi javvanulĕllā bhramase demarudu

(||||)
purigŏni nī vebŏddu pŏruguna nuṁḍam̐gānu
marugaguṁdurā gŏllamaṁkulai nā
iravainasuṭṭamavu ikkuvalu muṭṭagānu
paribarividhamula bhramase demarudu

(||||)
kaḍu nīvu bujjagiṁchi kāgiliṁchugŏnam̐gānu
aḍari sŏkkuguṁdurā achcharavainā
naḍusu śhrīveṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
baḍi ninnum̐ jūsevāru bhramase demarudu