Nettanam ganniya yidi neegaamgida nedigi

నెట్టనఁ గన్నియ యిది నీకాఁగిట నెదిగి
Language

(॥పల్లవి॥)
నెట్టనఁ గన్నియ యిది నీకాఁగిట నెదిగి
చుట్టమయి పట్టమేలే సుదతి నీకాయ

(॥నెట్టి॥)
ముప్పిరి నింతిచన్నులు మొలచిన నాఁటికి
గొప్పలై తిప్పలై కొండలాయను
యిప్పుఁ డిట్టె చూడఁగానె యీపెకన్నులుముత్తెపుఁ
చిప్పలై విప్పలై చిలుకమ్ము లాయను

(॥నెట్టి॥)
కారుకమ్మి నెరులివి కలికికొప్పులోనికి
మూరలై బారలై మోపులాయను
యీరీతిఁ దీరుగల దీపెపిరుఁ దింతలో
బారమై తోరమై బండికండ్లాయను

(॥నెట్టి॥)
భోగించునీలేమపొందైనకరములు
సోగలై బాగులై తీగెలాయను
యీగతి శ్రీవేంకటేశ యీకెచక్కఁదనాలు
పోగులై లాగులై పూజలు నీకాయను

(||pallavi||)
nĕṭṭanam̐ ganniya yidi nīgām̐giḍa nĕdigi
suṭṭamayi paṭṭamele sudadi nīgāya

(||nĕṭṭi||)
muppiri niṁtisannulu mŏlasina nām̐ṭigi
gŏppalai tippalai kŏṁḍalāyanu
yippum̐ ḍiṭṭĕ sūḍam̐gānĕ yībĕgannulumuttĕbum̐
sippalai vippalai silugammu lāyanu

(||nĕṭṭi||)
kārugammi nĕrulivi kaligigŏppulonigi
mūralai bāralai mobulāyanu
yīrīdim̐ dīrugala dībĕbirum̐ diṁtalo
bāramai toramai baṁḍigaṁḍlāyanu

(||nĕṭṭi||)
bhogiṁchunīlemabŏṁdainagaramulu
sogalai bāgulai tīgĕlāyanu
yīgadi śhrīveṁkaḍeśha yīgĕsakkam̐danālu
pogulai lāgulai pūjalu nīgāyanu