Nettanam baababunyaalu neesedivi | nee

నెట్టనఁ బాపపుణ్యాలు నీచేతివి । నీ
Language

(॥పల్లవి॥)
నెట్టనఁ బాపపుణ్యాలు నీచేతివి । నీ-
వొట్టి చనవియ్యగాను వొల్లనంటినా

(॥నెట్ట॥)
చలమేల మాతోను సాదించేవు నీ-
పలుకులకు లోనైనపడఁతులము
వలపు లేమిటి కింత వడిఁబెట్టేవు నీ-
వలసినట్టు సేయఁగా వద్దంటినా

(॥నెట్ట॥)
కడునిష్టూరములేల కట్టవచ్చేవు
విడువరానినీవెలఁదులము
జడిగొన్నమనసేల చండిసేసేవు నీ-
వొడివట్టఁగ నీతో వోపనంటినా

(॥నెట్ట॥)
బెట్టుగాఁగిటనేల బిగియించేవు
జట్టిగొన్ననీమోహంపుజవరాలను
గుట్టున శ్రీవేంకటేశ కూడితి నిన్ను
యిట్టె నావొద్దనుంటే యిచ్చగించనా

(||pallavi||)
nĕṭṭanam̐ bābabuṇyālu nīsedivi | nī-
vŏṭṭi sanaviyyagānu vŏllanaṁṭinā

(||nĕṭṭa||)
salamela mādonu sādiṁchevu nī-
palugulagu lonainabaḍam̐tulamu
valabu lemiḍi kiṁta vaḍim̐bĕṭṭevu nī-
valasinaṭṭu seyam̐gā vaddaṁṭinā

(||nĕṭṭa||)
kaḍuniṣhṭūramulela kaṭṭavachchevu
viḍuvarāninīvĕlam̐dulamu
jaḍigŏnnamanasela saṁḍisesevu nī-
vŏḍivaṭṭam̐ga nīdo vobanaṁṭinā

(||nĕṭṭa||)
bĕṭṭugām̐giḍanela bigiyiṁchevu
jaṭṭigŏnnanīmohaṁpujavarālanu
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidi ninnu
yiṭṭĕ nāvŏddanuṁṭe yichchagiṁchanā