Nettana yee maadalagu nenaa neegu

నెట్టన యీ మాటలకు నేనా నీకు
Language

(॥పల్లవి॥)
నెట్టన యీ మాటలకు నేనా నీకు
యెట్టనెదురుకట్ల నింక నేటి యానలు

(॥నెట్టిన॥)
అండ నున్నచెలు లెల్లా అట్టే చుట్టాలై వుండఁ గా
నిండుకొన్న లాఁతిదాన నేనా నీకు
వండవండనట్లుగా వారిఁ జూచి నవ్వేవు
యెండ లెల్లా నీడ లాయ నింక నేటి యానలు

(॥నెట్టిన॥)
యిరుగుపొరుగువారు ఇచ్చకము లాడఁగాను
నెరవుగా నిష్ఠూరిని నేనా నీకు
కరఁగి ఱచేవె వా కతలెల్లా నీసొమ్ము
యెరవు సతములాయ నింక నేటి యానలు

(॥నెట్టిన॥)
దొమ్మి డిగపువారు తొల్లే నీకు లోనుగాఁగ
నెమ్మినందుకుఁ దోడు నేనా నీకు
కమ్మర శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
యెమ్మె లెల్లా నెరవేరే నింక నేటి యానలు

(||pallavi||)
nĕṭṭana yī māḍalagu nenā nīgu
yĕṭṭanĕdurugaṭla niṁka neḍi yānalu

(||nĕṭṭina||)
aṁḍa nunnasĕlu lĕllā aṭṭe suṭṭālai vuṁḍam̐ gā
niṁḍugŏnna lām̐tidāna nenā nīgu
vaṁḍavaṁḍanaṭlugā vārim̐ jūsi navvevu
yĕṁḍa lĕllā nīḍa lāya niṁka neḍi yānalu

(||nĕṭṭina||)
yirugubŏruguvāru ichchagamu lāḍam̐gānu
nĕravugā niṣhṭhūrini nenā nīgu
karam̐gi ṟasevĕ vā kadalĕllā nīsŏmmu
yĕravu sadamulāya niṁka neḍi yānalu

(||nĕṭṭina||)
dŏmmi ḍigabuvāru tŏlle nīgu lonugām̐ga
nĕmminaṁdugum̐ doḍu nenā nīgu
kammara śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
yĕmmĕ lĕllā nĕravere niṁka neḍi yānalu