Nettana shreesadimaganigi sharanu

నెట్టన శ్రీసతిమగనికి శరణు
Language

(॥పల్లవి॥)
నెట్టన శ్రీసతిమగనికి శరణు
దిట్టయై సర్వేశుఁడైన దేవునికి శరణు

(॥నెట్ట॥)
చెలఁగి జగత్తులకు జీవులకుఁ బ్రాణమై
నెలవై వుండేయాతనికి శరణు
తెలివై మఱపై దేహాలలో సూత్రమై
వలనై రక్షించేయట్టివానికి శరణు

(॥నెట్ట॥)
చక్కఁగా వేదములకు సకలశాస్త్రములకు
నెక్కొని గుఱుతైనవానికి శరణు
దిక్కుదెసయి స్వతంత్రుఁడయి తేరిన‌ ఆదిమూలమై
అక్కజపు మహిమల యాతనికి శరణు

(॥నెట్ట॥)
యిరవుగఁ గరుణించి యిహపరాలొసగేటి-
నిరతి శ్రీవేంకటేశునికి శరణు
గురువై తల్లిదండ్రియై గుణము సుజ్ఞానము-
లెరవులేక యిచ్చేటి యీతనికి శరణు

(||pallavi||)
nĕṭṭana śhrīsadimaganigi śharaṇu
diṭṭayai sarveśhum̐ḍaina devunigi śharaṇu

(||nĕṭṭa||)
sĕlam̐gi jagattulagu jīvulagum̐ brāṇamai
nĕlavai vuṁḍeyādanigi śharaṇu
tĕlivai maṟabai dehālalo sūtramai
valanai rakṣhiṁcheyaṭṭivānigi śharaṇu

(||nĕṭṭa||)
sakkam̐gā vedamulagu sagalaśhāstramulagu
nĕkkŏni guṟudainavānigi śharaṇu
dikkudĕsayi svadaṁtrum̐ḍayi terina‌ ādimūlamai
akkajabu mahimala yādanigi śharaṇu

(||nĕṭṭa||)
yiravugam̐ garuṇiṁchi yihabarālŏsageḍi-
niradi śhrīveṁkaḍeśhunigi śharaṇu
guruvai tallidaṁḍriyai guṇamu sujñānamu-
lĕravulega yichcheḍi yīdanigi śharaṇu