Nettana remtigi vachchu nee jaadalu

నెట్టన రెంటికి వచ్చు నీ జాడలు
Language

(॥పల్లవి॥)
నెట్టన రెంటికి వచ్చు నీ జాడలు
గట్టువాయతనమో కరుణించు విధమో

(॥నెట్ట॥)
చిత్తము రంజిల్లఁ జేసి చెక్కులఁ గస్తూరి వ్రాసి
హత్తి యెంత బుజ్జగించే వాఁటదానిని
ఇత్తలఁ జేసినకల్ల యేమైనాఁ దొల్లి కలదో
కొత్తలైన నీమంచిగుణ మిట్టిదో

(॥నెట్ట॥)
భావము సోఁకఁబలికి పన్నీరు పైఁ జిలికి
మూవంకలాఁ జొక్కించేవు ముద్దరాలిని
ఆవల మర్మములు నీయందు నేమైనాఁగలవో
నీవొళ్లఁ గలిగిననేరు పిటువంటిదో

(॥నెట్ట॥)
చేసిన సేవకు మెచ్చి చేతికి విడెమిచ్చి
బాస ఇచ్చి కూడితివి పంతగత్తెను
అసల శ్రీవేంకటేశ అది నీ వినోదమో
వాసికి నిందరి నిట్టె వలపించేసాజమో

(||pallavi||)
nĕṭṭana rĕṁṭigi vachchu nī jāḍalu
gaṭṭuvāyadanamo karuṇiṁchu vidhamo

(||nĕṭṭa||)
sittamu raṁjillam̐ jesi sĕkkulam̐ gastūri vrāsi
hatti yĕṁta bujjagiṁche vām̐ṭadānini
ittalam̐ jesinagalla yemainām̐ dŏlli kalado
kŏttalaina nīmaṁchiguṇa miṭṭido

(||nĕṭṭa||)
bhāvamu som̐kam̐baligi pannīru paim̐ jiligi
mūvaṁkalām̐ jŏkkiṁchevu muddarālini
āvala marmamulu nīyaṁdu nemainām̐galavo
nīvŏḽlam̐ galiginaneru piḍuvaṁṭido

(||nĕṭṭa||)
sesina sevagu mĕchchi sedigi viḍĕmichchi
bāsa ichchi kūḍidivi paṁtagattĕnu
asala śhrīveṁkaḍeśha adi nī vinodamo
vāsigi niṁdari niṭṭĕ valabiṁchesājamo