Nettana neppudu naagu neeve dikku

నెట్టన నెప్పుడు నాకు నీవే దిక్కు
Language

(॥పల్లవి॥)
నెట్టన నెప్పుడు నాకు నీవే దిక్కు
గుట్టుతోడ నుండఁగానే గురుతాయ వలపు

(॥॥)
నంటున నీవాకెతో నవ్వులెల్ల నవ్వఁ గాను
ఇంటికిఁ బిలిచే నిన్ను నిదివో నేను
గొంటరిని పరాకుతోఁ గూడేనాతమకము
జంటసేసి పెనచఁగా సకులు నవ్వేరు

(॥॥)
తొడిఁబడ వేరొకతె తొడపై నీకుండఁగ
వొడివట్టి తీసేను వూరకే నిన్ను
అడరి నీయెమ్మెతో నట్టె నాయడియాస
కడఁగి సంకెఁ బెట్టఁగా కాంతలు నవ్వేరు

(॥॥)
పొరుగింతితో పొసఁగ మాఁటలాడఁ గా-
నరుదుగాఁ గాఁగిలించే నప్పటి నిన్ను
యీరవై శ్రీ వేంకటేశ యిద్దరిభావములు
సరివెట్టి చూడఁగాను సతులు నవ్వేరు

(||pallavi||)
nĕṭṭana nĕppuḍu nāgu nīve dikku
guṭṭudoḍa nuṁḍam̐gāne gurudāya valabu

(||||)
naṁṭuna nīvāgĕdo navvulĕlla navvam̐ gānu
iṁṭigim̐ bilise ninnu nidivo nenu
gŏṁṭarini parāgudom̐ gūḍenādamagamu
jaṁṭasesi pĕnasam̐gā sagulu navveru

(||||)
tŏḍim̐baḍa verŏgadĕ tŏḍabai nīguṁḍam̐ga
vŏḍivaṭṭi tīsenu vūrage ninnu
aḍari nīyĕmmĕdo naṭṭĕ nāyaḍiyāsa
kaḍam̐gi saṁkĕm̐ bĕṭṭam̐gā kāṁtalu navveru

(||||)
pŏrugiṁtido pŏsam̐ga mām̐ṭalāḍam̐ gā-
narudugām̐ gām̐giliṁche nappaḍi ninnu
yīravai śhrī veṁkaḍeśha yiddaribhāvamulu
sarivĕṭṭi sūḍam̐gānu sadulu navveru