నెట్టన నంతమాత్రాన నీ వాఁడె వాఁడు
(॥పల్లవి॥)
నెట్టన నంతమాత్రాన నీ వాఁడె వాఁడు
యెట్టైనాఁ గావకపోదు యీ సంబధమునను
(॥నెట్టున॥)
చిలుకను రామ తమ్మా పలుకు మను నొక్కఁడు
పిలుచుఁ దిమ్మా యని నీ పేరిటివాని నొక్కఁడు
వెలయ గోవిందా యని వెఱగువడు నొక్కఁడు
అలసినవేళ హరి హరి యను నొక్కఁడు
(॥నెట్టున॥)
సింగారానకు నొక్కఁడు చిన్ని తిరుమణి వెట్టు
వెంగొంగ నామము వెట్టు వెక్కిరింపుచు నొక్కఁడు
పంగనామముగఁ బెట్టు బహురూపగాఁడొక్కఁడు
సంగాతాలకుఁ బెట్టు వేసాల నామ మొక్కఁడు
(॥నెట్టున॥)
సరుగ నీ గుడిలోన సాగిలి పండు నొక్కఁడు
వరుస నూరకే తల వంచు సారె నొక్కఁడు
యిరవై శ్రీవేంకటేశ యిన్నీ నీ మొక్కులుగానే
అరసి చేకొందువు నీ వంత సులభుఁడవు
(||pallavi||)
nĕṭṭana naṁtamātrāna nī vām̐ḍĕ vām̐ḍu
yĕṭṭainām̐ gāvagabodu yī saṁbadhamunanu
(||nĕṭṭuna||)
siluganu rāma tammā palugu manu nŏkkam̐ḍu
pilusum̐ dimmā yani nī periḍivāni nŏkkam̐ḍu
vĕlaya goviṁdā yani vĕṟaguvaḍu nŏkkam̐ḍu
alasinaveḽa hari hari yanu nŏkkam̐ḍu
(||nĕṭṭuna||)
siṁgārānagu nŏkkam̐ḍu sinni tirumaṇi vĕṭṭu
vĕṁgŏṁga nāmamu vĕṭṭu vĕkkiriṁpusu nŏkkam̐ḍu
paṁganāmamugam̐ bĕṭṭu bahurūbagām̐ḍŏkkam̐ḍu
saṁgādālagum̐ bĕṭṭu vesāla nāma mŏkkam̐ḍu
(||nĕṭṭuna||)
saruga nī guḍilona sāgili paṁḍu nŏkkam̐ḍu
varusa nūrage tala vaṁchu sārĕ nŏkkam̐ḍu
yiravai śhrīveṁkaḍeśha yinnī nī mŏkkulugāne
arasi segŏṁduvu nī vaṁta sulabhum̐ḍavu