నెట్టన ధర్మపుణ్యాలు నీచేతివి
(॥పల్లవి॥)
నెట్టన ధర్మపుణ్యాలు నీచేతివి
గట్టిపెండ్లికొడుకవు కానిమ్మనవలెను
(॥నెట్ట॥)
సారెసారె నిన్ను నాకె సాకిరులే యడిగీని
చేరి నీవెఱిఁగినంత చెప్పవయ్యా
పొరచివచ్చినయట్టిపొత్తులమగవాఁడవు నీ-
వేరీతిఁ జేప్పినా మాకు వియ్యకొనవలెను
(॥నెట్ట॥)
నిక్కినిక్కి యప్పటిని నీమొగము చూచీని
పక్కన నాపెను వొడఁబరచవయ్యా
యెక్కుడుగాఁ దొల్లె నీవు యిద్దరాండమగఁడవు
వొక్కమాఁటే సంతోసాన నొడఁ బడవలెను
(॥నెట్ట॥)
కొత్తకొత్త మొరఁగులఁ గొంగువట్టి తీసీనె
చిత్తగించి సన్నలైనాఁ జేయవయ్యా
సత్తుగా శ్రీవేంకటేశ సరివారిమగఁడవు
హత్తి కూడితివి నిన్ను నట్టె మెచ్చవలెను
(||pallavi||)
nĕṭṭana dharmabuṇyālu nīsedivi
gaṭṭibĕṁḍligŏḍugavu kānimmanavalĕnu
(||nĕṭṭa||)
sārĕsārĕ ninnu nāgĕ sāgirule yaḍigīni
seri nīvĕṟim̐ginaṁta sĕppavayyā
pŏrasivachchinayaṭṭibŏttulamagavām̐ḍavu nī-
verīdim̐ jeppinā māgu viyyagŏnavalĕnu
(||nĕṭṭa||)
nikkinikki yappaḍini nīmŏgamu sūsīni
pakkana nābĕnu vŏḍam̐barasavayyā
yĕkkuḍugām̐ dŏllĕ nīvu yiddarāṁḍamagam̐ḍavu
vŏkkamām̐ṭe saṁtosāna nŏḍam̐ baḍavalĕnu
(||nĕṭṭa||)
kŏttagŏtta mŏram̐gulam̐ gŏṁguvaṭṭi tīsīnĕ
sittagiṁchi sannalainām̐ jeyavayyā
sattugā śhrīveṁkaḍeśha sarivārimagam̐ḍavu
hatti kūḍidivi ninnu naṭṭĕ mĕchchavalĕnu