నేసినట్టు సేయవయ్యా చిత్తము వచ్చినట్టల్లా
(॥పల్లవి॥)
నేసినట్టు సేయవయ్యా చిత్తము వచ్చినట్టల్లా
వాసివంతు లెంచుకొని వద్దన నేఁ జాలను
(॥॥)
పిలిపించినవాఁడవు ప్రియముగలవాఁడవు
చెలఁగి యెంతనవ్వినాఁ జెల్లు నీకు
వలపించినవాఁడవు వనమైననాఁడవు
అల మెంతభోగించినా నమరు నీకు
(॥॥)
వొడివట్టినవాఁడవు వొద్దఁభాయనివాఁడవు
తడవి యెంతపై కొన్నాఁ దగు నీకు
విడెమిచ్చినవాఁడవు వేడుక పడ్డవాఁడవు
కడఁగి చన్నులు విసుకఁదగవే నీకు
(॥॥)
పెనఁగేటివాఁడవు పెండ్లాడినవాఁడవు
ననిచి మోవి యానఁగ నాయమే నీకు
యెనసితివి శ్రీ వేంకటేశ యిన్నిటా నన్ను-
నొనగూడి మన్నించిను నుచితమే నీకు
(||pallavi||)
nesinaṭṭu seyavayyā sittamu vachchinaṭṭallā
vāsivaṁtu lĕṁchugŏni vaddana nem̐ jālanu
(||||)
pilibiṁchinavām̐ḍavu priyamugalavām̐ḍavu
sĕlam̐gi yĕṁtanavvinām̐ jĕllu nīgu
valabiṁchinavām̐ḍavu vanamainanām̐ḍavu
ala mĕṁtabhogiṁchinā namaru nīgu
(||||)
vŏḍivaṭṭinavām̐ḍavu vŏddam̐bhāyanivām̐ḍavu
taḍavi yĕṁtabai kŏnnām̐ dagu nīgu
viḍĕmichchinavām̐ḍavu veḍuga paḍḍavām̐ḍavu
kaḍam̐gi sannulu visugam̐dagave nīgu
(||||)
pĕnam̐geḍivām̐ḍavu pĕṁḍlāḍinavām̐ḍavu
nanisi movi yānam̐ga nāyame nīgu
yĕnasidivi śhrī veṁkaḍeśha yinniḍā nannu-
nŏnagūḍi manniṁchinu nusidame nīgu