నేసినట్టు సేయవయ్య చిత్తము వచ్చినయట్టు
(॥పల్లవి॥)
నేసినట్టు సేయవయ్య చిత్తము వచ్చినయట్టు
బాస దప్పే మగవానిఁ బట్ట వస మవునా
(॥నేసినట్టు॥)
నేమాన నేపుణ్య మైన నీవో కట్టుకొందు గాక
యే మనిన నీ మాట కెదు రాడేమా
మోము వంచు కాఁడువారు మూలనుండుదురుగాక
గామిడైన మగవానిఁ గక్కసించఁ జెల్లునా
(॥వేసినట్టు॥)
కిమ్ములవా రాడెటికీరితి నీదే కాక
యెమ్మె నెవ్వతెఁ దెచ్చినా నెగ్గు లెంచేమా
వుమ్మడిమానాపతులు వోరుచుకుందురు గాక
దిమ్మరి మగవారితో దీకొనఁగఁ జెల్లునా
(॥సేసినట్టు॥)
పాపపుణ్యములలోని ఫలము నీదే కాక
యేపని సేసిన నీతో నీసడించేమా
చేపట్టి కూడితి నన్ను చేతిలోనిదాన నంటా
పై పై శ్రీవెంకటేశ బలుము చెల్లునా
(||pallavi||)
nesinaṭṭu seyavayya sittamu vachchinayaṭṭu
bāsa dappe magavānim̐ baṭṭa vasa mavunā
(||nesinaṭṭu||)
nemāna nebuṇya maina nīvo kaṭṭugŏṁdu gāga
ye manina nī māḍa kĕdu rāḍemā
momu vaṁchu kām̐ḍuvāru mūlanuṁḍudurugāga
gāmiḍaina magavānim̐ gakkasiṁcham̐ jĕllunā
(||vesinaṭṭu||)
kimmulavā rāḍĕḍigīridi nīde kāga
yĕmmĕ nĕvvadĕm̐ dĕchchinā nĕggu lĕṁchemā
vummaḍimānābadulu vorusuguṁduru gāga
dimmari magavārido dīgŏnam̐gam̐ jĕllunā
(||sesinaṭṭu||)
pābabuṇyamulaloni phalamu nīde kāga
yebani sesina nīdo nīsaḍiṁchemā
sebaṭṭi kūḍidi nannu sedilonidāna naṁṭā
pai pai śhrīvĕṁkaḍeśha balumu sĕllunā