Nesavetti pemdlaadina seliya nenu

నేసవెట్టి పెండ్లాడిన చెలియ నేను
Language

(॥పల్లవి॥)
నేసవెట్టి పెండ్లాడిన చెలియ నేను
వేసరక నీవెంత వేఁడుకొనేవయ్యా

(॥॥)
పైపైఁ జన్నులమిఁది పయ్యదేల తీసేవు
రాపుగా నొండొకటితో రాసీనవి
మోపులుగా జవ్వనము మూటగట్టుకున్నదాన
చూపెట్టుక మమ్ము నెంత సోదించేవయ్యా

(॥॥)
చెలరేఁగి చెలరేఁగి చేతులేల పట్టేవు
చలివాసి తీగెలుసాగీనవి
మెలుపుఁ గాఁగిటి కివే మీఁదెత్తు కున్నదాన
పెలుచుఁజేఁతల నేల పెనఁగాడేవయ్యా

(॥॥)
ఆఁడనె నాపిరుఁదుల కాసలేల సేసేవు
బండికండ్లవలెనే బలము లవి
నిండుక శ్రీ వేంకటేశ నీ సొమ్ములు సేసితి
దుండగపురతి నెంత దొమ్మి సేసేవయ్యా

(||pallavi||)
nesavĕṭṭi pĕṁḍlāḍina sĕliya nenu
vesaraga nīvĕṁta vem̐ḍugŏnevayyā

(||||)
paibaim̐ jannulamim̐di payyadela tīsevu
rābugā nŏṁḍŏgaḍido rāsīnavi
mobulugā javvanamu mūḍagaṭṭugunnadāna
sūbĕṭṭuga mammu nĕṁta sodiṁchevayyā

(||||)
sĕlarem̐gi sĕlarem̐gi sedulela paṭṭevu
salivāsi tīgĕlusāgīnavi
mĕlubum̐ gām̐giḍi kive mīm̐dĕttu kunnadāna
pĕlusum̐jem̐tala nela pĕnam̐gāḍevayyā

(||||)
ām̐ḍanĕ nābirum̐dula kāsalela sesevu
baṁḍigaṁḍlavalĕne balamu lavi
niṁḍuga śhrī veṁkaḍeśha nī sŏmmulu sesidi
duṁḍagaburadi nĕṁta dŏmmi sesevayyā