Nerusuga tagilevu ne neemaada lanamgaa naa

నేరుచుక తగిలేవు నే నీమాట లనఁగా నా
Language

(॥పల్లవి॥)
నేరుచుక తగిలేవు నే నీమాట లనఁగా నా-
పేరు కొని యింకా నేల పిలిచేవు నీవు

(॥నేరు॥)
నీలాగు నే నెరఁగనా నే నిన్నుఁబై కొంటే
పేలరివై బిగిసేదీఁ బెనఁగేది
తాళలేక నీవలలఁ దగిలితి నింతెకాక
కేలు చాఁచింకేల పెనఁ గేవు నాతో నీవు

(॥నేరు॥)
తొల్లియుఁ గలవెకాదా తొడికి నే యెక్కితేను
వెల్లవిరిగా నవ్వేదీ విఱ్ఱవీఁగేదీ
చెల్లుబడి చేకొని చెనకుదు నింతెకాక
వొల్లివొల్ల కింకేల వొడివట్టేవు నీవు

(॥నేరు॥)
కారణము నేఁడు గంటిఁ గాఁగిట నే నినుఁ గూడి
యీరీతిఁ జవిసేసేదీ యిచ్చగించేదీ
గారవించి నన్ను శ్రీవేంకటేశుఁడ కూడితివి
మేర మీరి సారె నేల మెచ్చెవు నీవు

(||pallavi||)
nerusuga tagilevu ne nīmāḍa lanam̐gā nā-
peru kŏni yiṁkā nela pilisevu nīvu

(||neru||)
nīlāgu ne nĕram̐ganā ne ninnum̐bai kŏṁṭe
pelarivai bigisedīm̐ bĕnam̐gedi
tāḽalega nīvalalam̐ dagilidi niṁtĕgāga
kelu sām̐siṁkela pĕnam̐ gevu nādo nīvu

(||neru||)
tŏlliyum̐ galavĕgādā tŏḍigi ne yĕkkidenu
vĕllavirigā navvedī viṭravīm̐gedī
sĕllubaḍi segŏni sĕnagudu niṁtĕgāga
vŏllivŏlla kiṁkela vŏḍivaṭṭevu nīvu

(||neru||)
kāraṇamu nem̐ḍu gaṁṭim̐ gām̐giḍa ne ninum̐ gūḍi
yīrīdim̐ javisesedī yichchagiṁchedī
gāraviṁchi nannu śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidivi
mera mīri sārĕ nela mĕchchĕvu nīvu