నేరుతువు చేఁతలెల్లా నెరజాణవవుదువు
(॥పల్లవి॥)
నేరుతువు చేఁతలెల్లా నెరజాణవవుదువు
చేరి యీతనికి నీవు సేవలెల్లాఁ జేయవే
(॥నేరు॥)
చిక్క నివెన్నెల లేల చిమ్మి కలయఁబెట్టేవే
రెక్క లపిట్టలనేల రేఁచఁజొచ్చేవే
చొక్కపు చిగురులేల చెక్కులపై నదిమేవే
తక్కక నీరమణుని దలయెత్తి చూడవే
(॥నేరు॥)
తుమ్మిదల నెందాఁకా తొరలఁ గూడపెట్టేవే
తమ్మి రేకుల నెంతేసి దండగట్టేవే
ముమ్మరముగా మేన ముత్తే లెంత గూరిసేవే
నెమ్మదిఁ బతితో నోరు నిండా మాఁటలాడపే
(॥నేరు॥)
వూవక వూచిన చింతఁ బులుసేల వదకేవే
కోవలికూఁతలనేల గొణఁగించేవే
యావేళ నిన్నుఁగూడి ఇన్నిటాను మన్నించె
శ్రీవేంకటేశ్వరునిఁ జేరి మొక్కి మెచ్చవే
(||pallavi||)
neruduvu sem̐talĕllā nĕrajāṇavavuduvu
seri yīdanigi nīvu sevalĕllām̐ jeyave
(||neru||)
sikka nivĕnnĕla lela simmi kalayam̐bĕṭṭeve
rĕkka labiṭṭalanela rem̐sam̐jŏchcheve
sŏkkabu sigurulela sĕkkulabai nadimeve
takkaga nīramaṇuni dalayĕtti sūḍave
(||neru||)
tummidala nĕṁdām̐kā tŏralam̐ gūḍabĕṭṭeve
tammi regula nĕṁtesi daṁḍagaṭṭeve
mummaramugā mena mutte lĕṁta gūriseve
nĕmmadim̐ badido noru niṁḍā mām̐ṭalāḍabe
(||neru||)
vūvaga vūsina siṁtam̐ bulusela vadageve
kovaligūm̐talanela gŏṇam̐giṁcheve
yāveḽa ninnum̐gūḍi inniḍānu manniṁchĕ
śhrīveṁkaḍeśhvarunim̐ jeri mŏkki mĕchchave