Neruduve yiduvamti nerajaanadanamulu

నేరుతువే యిటువంటి నెరజాణతనములు
Language

(॥పల్లవి॥)
నేరుతువే యిటువంటి నెరజాణతనములు
కోరికె లింకా నెంత కుప్పళించేవే

(॥॥)
చెప్పిన నీ మాటలు చెలువుఁడు వినేఁగదే
కొప్పు జారఁగా నెంత కొసరేవే
ముప్పిరి నీ రాకకు ముచ్చటలూ నాడుఁగదే
రెప్ప లెత్తి చూచి యేమి రేఁచేవే వలపు

(॥॥)
సన్నల నీమోము చూచి సమ్మతిగ నవ్వేఁగదే
చన్ను లదరఁగా నేల జంకించేవే
పన్ని నీ తొడల మీఁదఁ బాదములు చాఁచెఁ గదే
కన్ను లా ర్చేఁటికిఁ దమకము పుట్టించేవే

(॥॥)
కమ్మర నీ సేవలకు కౌఁగిలించుకొనెఁ గదే
చెమ్మఁ జెమటల నెట్టు సిగ్గువడేవే
యిమ్ముల శ్రీ వేంకటేశుఁ డిరవుగా నిన్ను నేలే
బొమ్మ జంకెనల నెంత పొందు చూపేవే

(||pallavi||)
neruduve yiḍuvaṁṭi nĕrajāṇadanamulu
korigĕ liṁkā nĕṁta kuppaḽiṁcheve

(||||)
sĕppina nī māḍalu sĕluvum̐ḍu vinem̐gade
kŏppu jāram̐gā nĕṁta kŏsareve
muppiri nī rāgagu muchchaḍalū nāḍum̐gade
rĕppa lĕtti sūsi yemi rem̐seve valabu

(||||)
sannala nīmomu sūsi sammadiga navvem̐gade
sannu ladaram̐gā nela jaṁkiṁcheve
panni nī tŏḍala mīm̐dam̐ bādamulu sām̐sĕm̐ gade
kannu lā rsem̐ṭigim̐ damagamu puṭṭiṁcheve

(||||)
kammara nī sevalagu kaum̐giliṁchugŏnĕm̐ gade
sĕmmam̐ jĕmaḍala nĕṭṭu sigguvaḍeve
yimmula śhrī veṁkaḍeśhum̐ ḍiravugā ninnu nele
bŏmma jaṁkĕnala nĕṁta pŏṁdu sūbeve