నేరుతువే అన్నిటాను నెపాననే వలపించ
(॥పల్లవి॥)
నేరుతువే అన్నిటాను నెపాననే వలపించ
మేరమీరే వింతలోనే మెచ్చులాఁడి వౌదువే
(॥నేరు॥)
తెరలోని కిట వచ్చి తీగెసాగ మాటలాడి
వొరసేవే రమణుని వూరకే నీవు
సిరిమించ నవ్వు నవ్వి చేఁతల నట్టే కదిసి
సరమాడే వప్పటి జాణవౌదువే
(॥నేరు॥)
చెంతలనే కూచుండి చేతులఁ బాదా లొత్తుతా
మంతనాన యీతనిమర్మము లంటేవు
కొంత మోవిసన్న చూపి గుబ్బులు మెయిసోఁకించి
దొంతిఁబెట్టేవు పొందులు దొరవౌదువే
(॥నేరు॥)
వీడెము చేతకిచ్చితే వెసఁ బచ్చడము గప్పి
కూడేవు శ్రీవేంకటేశుఁ గూరిమితోను
యీడ నన్నేలె యీతఁడే యెఱుకలు సేసుకొని
జోడువాయ వెప్పుడును సుగుణవు నౌదువే
(||pallavi||)
neruduve anniḍānu nĕbānane valabiṁcha
meramīre viṁtalone mĕchchulām̐ḍi vauduve
(||neru||)
tĕraloni kiḍa vachchi tīgĕsāga māḍalāḍi
vŏraseve ramaṇuni vūrage nīvu
sirimiṁcha navvu navvi sem̐tala naṭṭe kadisi
saramāḍe vappaḍi jāṇavauduve
(||neru||)
sĕṁtalane kūsuṁḍi sedulam̐ bādā lŏttudā
maṁtanāna yīdanimarmamu laṁṭevu
kŏṁta movisanna sūbi gubbulu mĕyisom̐kiṁchi
dŏṁtim̐bĕṭṭevu pŏṁdulu dŏravauduve
(||neru||)
vīḍĕmu sedagichchide vĕsam̐ bachchaḍamu gappi
kūḍevu śhrīveṁkaḍeśhum̐ gūrimidonu
yīḍa nannelĕ yīdam̐ḍe yĕṟugalu sesugŏni
joḍuvāya vĕppuḍunu suguṇavu nauduve