(॥పల్లవి॥)
నేరుతువయ్యా నేరుపులు
పోరచి పొందులె భోగములు
(॥॥)
నలుగడ సెలవుల నవ్వు లివి
వలచినసతులకు వాడికలు
తలఁచినయప్పుడె తగులములు
పెలుచగునీతో పెనఁగులాటలు
(॥॥)
పరమమైననీపలుకు లివి
మరిగినవారికి మర్మములు
దొరకినయప్పుడె దోమటులు
పరగ నిండుకొనుపలు చూపరలుఁ
(॥॥)
వీడెపునీమోవివిందు లివి
కూడినమాకును కోరికలు
యీడుగ శ్రీవేంకటేశ్వరుఁడా
వేడుకరతు లివి వెల్లావిరులు
(||pallavi||)
neruduvayyā nerubulu
porasi pŏṁdulĕ bhogamulu
(||||)
nalugaḍa sĕlavula navvu livi
valasinasadulagu vāḍigalu
talam̐sinayappuḍĕ tagulamulu
pĕlusagunīdo pĕnam̐gulāḍalu
(||||)
paramamainanībalugu livi
mariginavārigi marmamulu
dŏraginayappuḍĕ domaḍulu
paraga niṁḍugŏnubalu sūbaralum̐
(||||)
vīḍĕbunīmoviviṁdu livi
kūḍinamāgunu korigalu
yīḍuga śhrīveṁkaḍeśhvarum̐ḍā
veḍugaradu livi vĕllāvirulu