Nerudunaa nenemainaa neemahima limtegaaga

నేరుతునా నేనేమైనా నీమహిమ లింతేకాక
Language

(॥పల్లవి॥)
నేరుతునా నేనేమైనా నీమహిమ లింతేకాక
వూరకే వుండేనన్నా వుద్యే(ద్యో?)గాలఁ బెట్టును

(॥నేరు॥)
నెట్టుకొన్న యటువంటినీతోడిపొందులు
రట్టుసేయవా నీచుట్టాలనెల్లా
గుట్టున నెంతవుండినాఁ గొచ్చికొచ్చి పెడఁరేచి
దిట్టమాట లాడించు దీకొని నీతోను

(॥నేరు॥)
కూరిమితో నీకాఁగిటఁ గూడేటి కూటములు
ఆరీతి రేఁచకుండునా అఁడవారిని
యేరేతిసాదులనైనా యెమ్మెలెల్లాఁ బుట్టించి
నేరములు పట్టింపించు నిన్నునే సారెకును

(॥నేరు॥)
సందడించినటువంటి సరసపురతు లివి
మందెమేళము సేయించు మానినులను
కందువ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
అందాలు సేయించును నీయరఁగొరలెల్లాను

(||pallavi||)
nerudunā nenemainā nīmahima liṁtegāga
vūrage vuṁḍenannā vudye(dyo?)gālam̐ bĕṭṭunu

(||neru||)
nĕṭṭugŏnna yaḍuvaṁṭinīdoḍibŏṁdulu
raṭṭuseyavā nīsuṭṭālanĕllā
guṭṭuna nĕṁtavuṁḍinām̐ gŏchchigŏchchi pĕḍam̐resi
diṭṭamāḍa lāḍiṁchu dīgŏni nīdonu

(||neru||)
kūrimido nīgām̐giḍam̐ gūḍeḍi kūḍamulu
ārīdi rem̐saguṁḍunā am̐ḍavārini
yeredisādulanainā yĕmmĕlĕllām̐ buṭṭiṁchi
neramulu paṭṭiṁpiṁchu ninnune sārĕgunu

(||neru||)
saṁdaḍiṁchinaḍuvaṁṭi sarasaburadu livi
maṁdĕmeḽamu seyiṁchu māninulanu
kaṁduva śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
aṁdālu seyiṁchunu nīyaram̐gŏralĕllānu