Nerudumu neegamte ne mimdaramu

నేరుతుము నీకంటె నే మిందరము
Language

(॥పల్లవి॥)
నేరుతుము నీకంటె నే మిందరము
ఆ రీతిఁ బెనఁగకుంటే నందువు గాని

(॥॥)
యేడలేనిమాటలు నీవిన్ని నేరుచుక వచ్చి
ఆడేవు సిగ్గుపడక ఆఁడువారిలో
వోడక యేకతమున నొరసి నిలువరాదా
జోడగు మాసరితలు చూతువు గావి

(॥॥)
కన్న కన్న చోటులను కతలెల్లాఁ జూచి వచ్చి
సన్నలనే చూపేవు సబలలోన
యిన్నేసి తడవనేల ఇంటిలోనికి రారాదా
కన్నెలము మాసేఁతలు కందువు గాని

(॥॥)
తలఁపులో నొక్కొక్కటే తలఁచుక నీవు వచ్చి
అలమేపు కాఁగిట నన్నాడా నీడాను
అలమేలుమంగను పాయకు శ్రీ వేంకటేశుఁడ
తిలకించి మాగుణాలు తెలిసేవు గాని

(||pallavi||)
nerudumu nīgaṁṭĕ ne miṁdaramu
ā rīdim̐ bĕnam̐gaguṁṭe naṁduvu gāni

(||||)
yeḍalenimāḍalu nīvinni nerusuga vachchi
āḍevu siggubaḍaga ām̐ḍuvārilo
voḍaga yegadamuna nŏrasi niluvarādā
joḍagu māsaridalu sūduvu gāvi

(||||)
kanna kanna soḍulanu kadalĕllām̐ jūsi vachchi
sannalane sūbevu sabalalona
yinnesi taḍavanela iṁṭilonigi rārādā
kannĕlamu māsem̐talu kaṁduvu gāni

(||||)
talam̐pulo nŏkkŏkkaḍe talam̐suga nīvu vachchi
alamebu kām̐giḍa nannāḍā nīḍānu
alamelumaṁganu pāyagu śhrī veṁkaḍeśhum̐ḍa
tilagiṁchi māguṇālu tĕlisevu gāni