నేరుపు చాలక నీవే నేరములెంచేవు గాక
(॥పల్లవి॥)
నేరుపు చాలక నీవే నేరములెంచేవు గాక
సారె నీవు చెనకితే సరి దాఁ జెనకదా
(॥నేరు॥)
వుండనుండ మోహములు వూటనీటి చెలమలు
మెండుగాఁ గొసరితేను మీసాలపై తేనైయుండు
దండి సిగ్గుతోఁ జెలి తలవంచితే నేమాయ
అండ నీవు నవ్వితేను ఆపె తానే నవ్వదా
(॥నేరు ॥)
సేయఁజేయ జెలుములు చెట్లపై కాయలు
రాయడించి పెనఁగితే రాలుఁబిందెలై వుండు
పాయపు వనిత నీతో పంతమాడితే నేమాయ
ఈయెడఁ జేఇ వేసితేను యీపె నీపై వేయదా
(॥నేరు॥)
కూడఁగూడఁ గూటములు గోరగీరిన యేరులు
వాడికలు లేకుంటే వానవెల్లులై వుండు
జాడతో శ్రీ వేంకటేశ సతి మించితే నేమాయ
వీడె మిచ్చెన సితివి వీడుకూళ్లు వెట్టదా
(||pallavi||)
nerubu sālaga nīve neramulĕṁchevu gāga
sārĕ nīvu sĕnagide sari dām̐ jĕnagadā
(||neru||)
vuṁḍanuṁḍa mohamulu vūḍanīḍi sĕlamalu
mĕṁḍugām̐ gŏsaridenu mīsālabai tenaiyuṁḍu
daṁḍi siggudom̐ jĕli talavaṁchide nemāya
aṁḍa nīvu navvidenu ābĕ tāne navvadā
(||neru ||)
seyam̐jeya jĕlumulu sĕṭlabai kāyalu
rāyaḍiṁchi pĕnam̐gide rālum̐biṁdĕlai vuṁḍu
pāyabu vanida nīdo paṁtamāḍide nemāya
īyĕḍam̐ jei vesidenu yībĕ nībai veyadā
(||neru||)
kūḍam̐gūḍam̐ gūḍamulu goragīrina yerulu
vāḍigalu leguṁṭe vānavĕllulai vuṁḍu
jāḍado śhrī veṁkaḍeśha sadi miṁchide nemāya
vīḍĕ michchĕna sidivi vīḍugūḽlu vĕṭṭadā