Nerubu linniyu nimka nee sedidi

నేరుపు లిన్నియు నిఁక నీ చేతిది
Language

(॥పల్లవి॥)
నేరుపు లిన్నియు నిఁక నీ చేతిది
సారె వలపుల సంతోసాన నుందానను

(॥నేరు॥)
కాఁకలు నీమీఁదఁ జల్లి కాఁతాళముతో నుండితి
చేఁకట నీవు పట్టితే సిగ్గువడితి
యేఁకటతో నీవే నన్ను ఇంతాఁ జేసేవాఁడవు
వేఁకపు జవ్వనముతో వెరంగైవుందానను

(॥నేరు॥)
యేకతమైనపుడే నిన్నెల ఇంచేనంటా నుందు
వాకుచ్చి మాటాడితే నీవసమౌదును
పైకొని నీవే ఇంతా భ్రమ ఇంచేవాఁడవు
దా కొని మొగమోటకు దగులై వుందానను

(॥నేరు॥)
నించిన రతుల నిన్ను నీరేనంటా నుండితి
అంచెల నీవు గూడితే నట్టె వుంటిని
నించి శ్రీ వేంకటేశుఁడ నీవింతాఁ జేసేవాఁడవు
దించని సంభ్రమముతో తిరమై వుందానను

(||pallavi||)
nerubu linniyu nim̐ka nī sedidi
sārĕ valabula saṁtosāna nuṁdānanu

(||neru||)
kām̐kalu nīmīm̐dam̐ jalli kām̐tāḽamudo nuṁḍidi
sem̐kaḍa nīvu paṭṭide sigguvaḍidi
yem̐kaḍado nīve nannu iṁtām̐ jesevām̐ḍavu
vem̐kabu javvanamudo vĕraṁgaivuṁdānanu

(||neru||)
yegadamainabuḍe ninnĕla iṁchenaṁṭā nuṁdu
vāguchchi māḍāḍide nīvasamaudunu
paigŏni nīve iṁtā bhrama iṁchevām̐ḍavu
dā kŏni mŏgamoḍagu dagulai vuṁdānanu

(||neru||)
niṁchina radula ninnu nīrenaṁṭā nuṁḍidi
aṁchĕla nīvu gūḍide naṭṭĕ vuṁṭini
niṁchi śhrī veṁkaḍeśhum̐ḍa nīviṁtām̐ jesevām̐ḍavu
diṁchani saṁbhramamudo tiramai vuṁdānanu