Nerubu galidem jaalu neeve nenu

నేరుపు గలితేఁ జాలు నీవే నేను
Language

(॥పల్లవి॥)
నేరుపు గలితేఁ జాలు నీవే నేను
దూరి మాటాట నోప మందు లిట్టె నూరకురా

(॥నేరుప॥)
యెప్పడు నీ వారమే యేల పిలిచేవు మమ్ము
చప్ప నై నీ నోరు నొచ్చీఁ జాలించ రాదా
నెప్పున నే నీడ నుంటే నీ వద్ద నుండుట గాదా
ముప్పిరిఁ బెనఁగ నోప ముంజుయి వట్టకురా

(॥నేవుప॥)
వూడిగపువార మింతే వొడ లేల నిమిరేవు
తోడ నీచేతు లరిగీఁ దొలఁగ రాదా
నీడల నే నవ్వితేనె నీ పరిణామము గాదా
వీడ నాడ నే నోప వేసాలు సేయకురా

(॥నేరుప॥)
నీకు మేనదాన నింతే నీ వేల కిందు పడేవు
కాకై నీ రాజసము కైకో రాదా
యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
నీకు నే సరిగా నోప నీ వంత మెచ్చకురా

(||pallavi||)
nerubu galidem̐ jālu nīve nenu
dūri māḍāḍa noba maṁdu liṭṭĕ nūragurā

(||neruba||)
yĕppaḍu nī vārame yela pilisevu mammu
sappa nai nī noru nŏchchīm̐ jāliṁcha rādā
nĕppuna ne nīḍa nuṁṭe nī vadda nuṁḍuḍa gādā
muppirim̐ bĕnam̐ga noba muṁjuyi vaṭṭagurā

(||nevuba||)
vūḍigabuvāra miṁte vŏḍa lela nimirevu
toḍa nīsedu larigīm̐ dŏlam̐ga rādā
nīḍala ne navvidenĕ nī pariṇāmamu gādā
vīḍa nāḍa ne noba vesālu seyagurā

(||neruba||)
nīgu menadāna niṁte nī vela kiṁdu paḍevu
kāgai nī rājasamu kaigo rādā
yīgaḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
nīgu ne sarigā noba nī vaṁta mĕchchagurā