Nerubellaa nokkade nelamtala bhaagya mimte

నేరుపెల్లా నొక్కటే నెలఁతల భాగ్య మింతే
Language

(॥పల్లవి॥)
నేరుపెల్లా నొక్కటే నెలఁతల భాగ్య మింతే
సారెసారె ముట్టకురా సటలకు వచ్చేనా

(॥నేరు॥)
కన్ను లార్చ నేరుతురు కడు నవ్వ నేరుతురు
కన్నెలట పురుషులఁ గరఁచలేరా
వన్నెల మోహము గల్తే వాడులైనా నింపులే
మన్నించరా రమణుఁడ మాటలకు వచ్చేనా

(॥నేరు॥)
చక్కఁదనాలూఁ గలవు చతురతలుఁ గలవు
చొక్కపుఁ గామినులట చొక్కించలేరా
గక్కనఁ జనవు గల్తే గర్వమైనా చందమౌను
చెక్కునొక్కకురా నీవు చేతఁలకు వచ్చేనా

(॥నేరు॥)
పైకొని కూడఁగవచ్చు పంతములాడఁగవచ్చు
లోకములో సతులట లోఁగ నున్నదా
మేకొని శ్రీవేంకటేశ మించి నన్నుఁగూడితివి
పోకురా యెందునుఁ దలపోఁతలకు వచ్చేనా

(||pallavi||)
nerubĕllā nŏkkaḍe nĕlam̐tala bhāgya miṁte
sārĕsārĕ muṭṭagurā saḍalagu vachchenā

(||neru||)
kannu lārsa neruduru kaḍu navva neruduru
kannĕlaḍa puruṣhulam̐ garam̐salerā
vannĕla mohamu galde vāḍulainā niṁpule
manniṁcharā ramaṇum̐ḍa māḍalagu vachchenā

(||neru||)
sakkam̐danālūm̐ galavu saduradalum̐ galavu
sŏkkabum̐ gāminulaḍa sŏkkiṁchalerā
gakkanam̐ janavu galde garvamainā saṁdamaunu
sĕkkunŏkkagurā nīvu sedam̐lagu vachchenā

(||neru||)
paigŏni kūḍam̐gavachchu paṁtamulāḍam̐gavachchu
logamulo sadulaḍa lom̐ga nunnadā
megŏni śhrīveṁkaḍeśha miṁchi nannum̐gūḍidivi
pogurā yĕṁdunum̐ dalabom̐talagu vachchenā