Nerube nidhaanamu nelamtalagu

నేరుపే నిధానము నెలఁతలకు
Language

(॥పల్లవి॥)
నేరుపే నిధానము నెలఁతలకు
తారుకాణ నామాట తలఁచుకొవే

(॥నేరు॥)
వినయములే సేసి వేడుక పుట్టించితే
మనసు గరఁగు నిట్టె మగవానికి
యెనయఁ గొలువుసేసి ఇచ్చకమే నెరపితే
ననుపులు సమకూరు నాయకునికి

(॥నేరు॥)
చెప్పినట్టెల్లాఁ జేసి చేరి పాయకుండితేను
కప్పుకొనుఁ దమకము కాంతునికి
వొప్పుగా మాటలాడి వొరిమతో మెలఁగితే
చిప్పిలఁ గళలు రేఁగు చెలువునికి

(॥నేరు॥)
చతురత నవ్వు నవ్వి సరసము లాడితేను
రతులఁ గాంక్షలు వుట్టు రమణునికి
సతమై శ్రేవేంకటేశు పతివైతి విట్లైతే
యితవులౌ నన్నియును యితనికిని

(||pallavi||)
nerube nidhānamu nĕlam̐talagu
tārugāṇa nāmāḍa talam̐sugŏve

(||neru||)
vinayamule sesi veḍuga puṭṭiṁchide
manasu garam̐gu niṭṭĕ magavānigi
yĕnayam̐ gŏluvusesi ichchagame nĕrabide
nanubulu samagūru nāyagunigi

(||neru||)
sĕppinaṭṭĕllām̐ jesi seri pāyaguṁḍidenu
kappugŏnum̐ damagamu kāṁtunigi
vŏppugā māḍalāḍi vŏrimado mĕlam̐gide
sippilam̐ gaḽalu rem̐gu sĕluvunigi

(||neru||)
sadurada navvu navvi sarasamu lāḍidenu
radulam̐ gāṁkṣhalu vuṭṭu ramaṇunigi
sadamai śhreveṁkaḍeśhu padivaidi viṭlaide
yidavulau nanniyunu yidanigini