నేరుపే కలిగితేను నెయ్యము దానే కూడు
(॥పల్లవి॥)
నేరుపే కలిగితేను నెయ్యము దానే కూడు
తారుకాణ వచ్చితేను తలఁపెల్లా నొక్కటే
(॥నేరు॥)
మళ్లి మళ్లి చూచితేను మాఁటలెన్నైనాఁగలవు
వెల్లవిరిగా నన్నీ వింటినే నేను
చెల్లుబడి గలవారు సేసినదే చేఁతగాదా
యెల్లవారు వినఁగా నన్నే లొడఁబడచీనే
(॥నేరు॥)
తప్పక చూచితేను తనివెంతైనాఁ దీరదు
వొప్పుగ తనవద్దనే వుందానఁగదే
యెప్పుడూనుఁ గలవారి నెవ్వరైనాఁ గాదందురా
ముప్పిరి నమ్మికలేల ముంచి తాఁ జేసీనే
(॥నేరు॥)
వేడుకకు నవ్వితేను వెలవెట్ట వసగాదు
ఆడినట్టే దేవుల నేనైతిఁ గదవే
యీడనే శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
మేడెపు నారతు లెంత మేకొని మెచ్చీనే
(||pallavi||)
nerube kaligidenu nĕyyamu dāne kūḍu
tārugāṇa vachchidenu talam̐pĕllā nŏkkaḍe
(||neru||)
maḽli maḽli sūsidenu mām̐ṭalĕnnainām̐galavu
vĕllavirigā nannī viṁṭine nenu
sĕllubaḍi galavāru sesinade sem̐tagādā
yĕllavāru vinam̐gā nanne lŏḍam̐baḍasīne
(||neru||)
tappaga sūsidenu tanivĕṁtainām̐ dīradu
vŏppuga tanavaddane vuṁdānam̐gade
yĕppuḍūnum̐ galavāri nĕvvarainām̐ gādaṁdurā
muppiri nammigalela muṁchi tām̐ jesīne
(||neru||)
veḍugagu navvidenu vĕlavĕṭṭa vasagādu
āḍinaṭṭe devula nenaidim̐ gadave
yīḍane śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
meḍĕbu nāradu lĕṁta megŏni mĕchchīne