నేరుపవయ్యా నాకు నీతోడి కాఁపురాలు
(॥పల్లవి॥)
నేరుపవయ్యా నాకు నీతోడి కాఁపురాలు
చేరి నీకు మోహించిన చిన్నదాన నేను
(॥నేరు॥)
కామించి నీకు నేను కడుబత్తి సేతును
యేమని వున్నదో చిత్త మెఱఁగ నేను
చేముట్టి సరసమాడి చెక్కునొక్కి వేఁడుకొందు
నేమముతో జొక్కెంచనేరను నేను
(॥నేరు॥)
చనవుసేసుక నీతో సారెకు మాఁటాడుకొను
వొనరిన నీ గుణము లూహించ నేను
పెనఁగి పెనఁగి నీపైఁ బ్రియములు చల్లుదు
తనిసి నీవుద్యోగము దలఁచ నేను
(॥నేరు॥)
చక్కని నీమోము చూచి సంతొసించుకొందును
యెక్కుడైన నీమన్నన లెంచనునేను
గక్కన శ్రీవేంకటేశ కాఁగిలించుకొందు నిన్ను
చొక్కపు నీవేళలు సోదించనేను
(||pallavi||)
nerubavayyā nāgu nīdoḍi kām̐purālu
seri nīgu mohiṁchina sinnadāna nenu
(||neru||)
kāmiṁchi nīgu nenu kaḍubatti sedunu
yemani vunnado sitta mĕṟam̐ga nenu
semuṭṭi sarasamāḍi sĕkkunŏkki vem̐ḍugŏṁdu
nemamudo jŏkkĕṁchaneranu nenu
(||neru||)
sanavusesuga nīdo sārĕgu mām̐ṭāḍugŏnu
vŏnarina nī guṇamu lūhiṁcha nenu
pĕnam̐gi pĕnam̐gi nībaim̐ briyamulu salludu
tanisi nīvudyogamu dalam̐sa nenu
(||neru||)
sakkani nīmomu sūsi saṁtŏsiṁchugŏṁdunu
yĕkkuḍaina nīmannana lĕṁchanunenu
gakkana śhrīveṁkaḍeśha kām̐giliṁchugŏṁdu ninnu
sŏkkabu nīveḽalu sodiṁchanenu