Nerubaru limdarunu nerajaanam daadamdu

నేరుపరు లిందరును నెరజాణఁ డాతఁడు
Language

(॥పల్లవి॥)
నేరుపరు లిందరును నెరజాణఁ డాతఁడు
ఆ రీతి వేసరకుండా నండకుఁ దేఁగదరే

(॥నేరు॥)
వాసులేల రేఁచేరే వద్దువద్దు ఆతనితో
సేసుకొన్నమగఁడట చెప్పవలెనా
ఆసపడ్డదాన నేను ఆయ మెరుఁగు నాతఁడు
వేసట గాకుండానే విన్న వించఁగదరే

(॥నేరు॥)
తప్పులేల మోపేరే తగవుగా దాతనికి
కుప్పళించే వలపట కొసరనేల
కప్పురపుదాన నేను కలిగినవాఁ డతఁడు
యెప్పుడుఁ జిన్నఁబోకుండా నెఱిఁగించఁగదరే

(॥నేరు॥)
సిగ్గులేల పరచేరే చేతికిలోనై తానే
వొగ్గి శ్రీవేంకటేశుఁడే వొనగూడెను
తగ్గులేనిదాన నేను దయఁజూచేవాఁడు దానే
కగ్గులేకుండా నిచ్చకము లాడఁగదరే

(||pallavi||)
nerubaru liṁdarunu nĕrajāṇam̐ ḍādam̐ḍu
ā rīdi vesaraguṁḍā naṁḍagum̐ dem̐gadare

(||neru||)
vāsulela rem̐sere vadduvaddu ādanido
sesugŏnnamagam̐ḍaḍa sĕppavalĕnā
āsabaḍḍadāna nenu āya mĕrum̐gu nādam̐ḍu
vesaḍa gāguṁḍāne vinna viṁcham̐gadare

(||neru||)
tappulela mobere tagavugā dādanigi
kuppaḽiṁche valabaḍa kŏsaranela
kappurabudāna nenu kaliginavām̐ ḍadam̐ḍu
yĕppuḍum̐ jinnam̐boguṁḍā nĕṟim̐giṁcham̐gadare

(||neru||)
siggulela parasere sedigilonai tāne
vŏggi śhrīveṁkaḍeśhum̐ḍe vŏnagūḍĕnu
taggulenidāna nenu dayam̐jūsevām̐ḍu dāne
kagguleguṁḍā nichchagamu lāḍam̐gadare