Nerubarivi neevaide nelamtai te muddaraalu

నేరుపరివి నీవైతే నెలఁతై తే ముద్దరాలు
Language

(॥పల్లవి॥)
నేరుపరివి నీవైతే నెలఁతై తే ముద్దరాలు
పేరునఁ బిలిచి నీవే పెనఁగఁగరాదా

(॥॥)
చిన్నదిగనక యింతి సిగ్గుతోడ నున్నది
అన్నిటా రట్టడివి మాటాడించరాదా
తన్నుఁదానె నీపై ప్రేమ దాఁచుకొని వున్నది
సన్నలనే నీమోవి చవిచూపరాదా

(॥॥)
జవరాలుగనక ఆసలఁ బొంచుకవున్నది
నవకపుజాణవు నవ్వించరాదా
వివరించి బత్తి వెల్లవిరి సేయకున్నది
చివురుకెంగేలు చాఁచి చిమ్మిరేఁచరాదా

(॥॥)
కొమరెగనక కడుగుట్టుఁతోడ నున్నది
నెమకి దిట్టవు మేలు నెరపరాదా
అమర శ్రీవేంకటేశ అండ వాయకున్నది
సమరతి నిట్లానే చనవియ్యరాదా

(||pallavi||)
nerubarivi nīvaide nĕlam̐tai te muddarālu
perunam̐ bilisi nīve pĕnam̐gam̐garādā

(||||)
sinnadiganaga yiṁti siggudoḍa nunnadi
anniḍā raṭṭaḍivi māḍāḍiṁcharādā
tannum̐dānĕ nībai prema dām̐sugŏni vunnadi
sannalane nīmovi savisūbarādā

(||||)
javarāluganaga āsalam̐ bŏṁchugavunnadi
navagabujāṇavu navviṁcharādā
vivariṁchi batti vĕllaviri seyagunnadi
sivurugĕṁgelu sām̐si simmirem̐sarādā

(||||)
kŏmarĕganaga kaḍuguṭṭum̐toḍa nunnadi
nĕmagi diṭṭavu melu nĕrabarādā
amara śhrīveṁkaḍeśha aṁḍa vāyagunnadi
samaradi niṭlāne sanaviyyarādā