Nerubarivi nauduvu nerajaana vauduvu

నేరుపరివి నౌదువు నెరజాణ వౌదువు
Language

(॥పల్లవి॥)
నేరుపరివి నౌదువు నెరజాణ వౌదువు
మేర మీరేనంటే నన్ను మేకులఁ బెట్టితివి

(॥నేరు॥)
మచ్చరించి నేనీతో మారువట లాడఁగాను
కుచ్చి కాఁగిలించుకొంటి కోపగించక
ఇచ్చకుఁడ వౌదువు ఇంతవాఁడవు గాకున్న
వచ్చేరా పదారువేలు వలచి నీ వెంటను

(॥నేరు॥)
పెక్కులాగులను నీతో పెనఁగి తప్పించుకోఁగా
ఇక్కువ లంటితివి నీ వెగ్గుపట్టక
తక్కరఁడ వౌదు వింతదంటతనము లేకున్న
మొక్కుదురా గోపికలు ముంచి సిగ్గువిడిచి

(॥నేరు॥)
పంతాన నేఁబానుపుపై పవ్వళించి వుండఁగాను
చింతదీరఁ గూడితివి సిగ్గువడక
శాంతుఁడ శ్రీ వేంకటేశ సరసమింత లేకున్న
ఇంతని నీవురముపై నిరవైతి నరుధా

(||pallavi||)
nerubarivi nauduvu nĕrajāṇa vauduvu
mera mīrenaṁṭe nannu megulam̐ bĕṭṭidivi

(||neru||)
machchariṁchi nenīdo māruvaḍa lāḍam̐gānu
kuchchi kām̐giliṁchugŏṁṭi kobagiṁchaga
ichchagum̐ḍa vauduvu iṁtavām̐ḍavu gāgunna
vachcherā padāruvelu valasi nī vĕṁṭanu

(||neru||)
pĕkkulāgulanu nīdo pĕnam̐gi tappiṁchugom̐gā
ikkuva laṁṭidivi nī vĕggubaṭṭaga
takkaram̐ḍa vaudu viṁtadaṁṭadanamu legunna
mŏkkudurā gobigalu muṁchi sigguviḍisi

(||neru||)
paṁtāna nem̐bānububai pavvaḽiṁchi vuṁḍam̐gānu
siṁtadīram̐ gūḍidivi sigguvaḍaga
śhāṁtum̐ḍa śhrī veṁkaḍeśha sarasamiṁta legunna
iṁtani nīvuramubai niravaidi narudhā