(॥పల్లవి॥)
నేరుపరివౌదు వన్నిటా నీవు
యీరీతి మమ్ముఁ జూచి నీవేల నవ్వేవయ్యా
(॥నేరు॥)
మచ్చికసేసిననీమాటలకు లోనై
రచ్చలకు నెక్కితిమి రవ్వయితిమి
పచ్చినీసతులచేతి పలుకులకు లోనైతి-
మిచ్చల మమ్ముఁజూచి నీవేల నవ్వేవయ్యా
(॥నేరు॥)
సోగకన్నులఁ జూచేనీచూపులకు లోఁగి లోఁగి
జాగులకు లోనైతిమి సరియైతిమి
బాగులై ననీవద్దిపడఁతులఁ జూచితిమి
యీగతి నీవింతలోనేల నవ్వేవయ్యా
(॥నేరు॥)
చేవలు దేరిన నీచేఁతలకు జొక్కి చొక్కి
వావులు దెలుపుకొంటి వనితనైతి
దేవ శ్రీవేంకటేశ నీదేవి నలమేల్మంగను
యీవేళఁ గూడితివి నీవేల నవ్వేవయ్యా
(||pallavi||)
nerubarivaudu vanniḍā nīvu
yīrīdi mammum̐ jūsi nīvela navvevayyā
(||neru||)
machchigasesinanīmāḍalagu lonai
rachchalagu nĕkkidimi ravvayidimi
pachchinīsadulasedi palugulagu lonaidi-
michchala mammum̐jūsi nīvela navvevayyā
(||neru||)
sogagannulam̐ jūsenīsūbulagu lom̐gi lom̐gi
jāgulagu lonaidimi sariyaidimi
bāgulai nanīvaddibaḍam̐tulam̐ jūsidimi
yīgadi nīviṁtalonela navvevayyā
(||neru||)
sevalu derina nīsem̐talagu jŏkki sŏkki
vāvulu dĕlubugŏṁṭi vanidanaidi
deva śhrīveṁkaḍeśha nīdevi nalamelmaṁganu
yīveḽam̐ gūḍidivi nīvela navvevayyā