Nerubarinaide naamde ninninnidaa meppimchanaa

నేరుపరినైతే నాఁడే నిన్నిన్నిటా మెప్పించనా
Language

(॥పల్లవి॥)
నేరుపరినైతే నాఁడే నిన్నిన్నిటా మెప్పించనా
వూరకే నే మొగమోడి నుందానఁ గాక

(॥నేరు॥)
మంకుదాననైతే నిన్ను మాటలాడ నిత్తునా
బింకపు దాననైతేను పెచ్చు రేఁచనా
అంకకత్తెనైతే గోర నాయము లంటించనా
పొంక మెఱఁగక నిన్నుఁ బొదిగేఁగాక

(॥నేరు॥)
పంతగత్తెనైతే నీకు బలుములు చూపనా
వింతదాననైతే నిన్ను వేసరించనా
జంతదానివలెనైతే చలము సాదించనా
అంతేసి నేరక నీకు నాలనైతిఁ గాక

(॥నేరు॥)
కపటపు దాన నైతే కాఁకలను ముంచనా
కపురులదాననైతే గతి గూడనా
యిపుడె నన్నుఁ గూడితి వెరిఁగి శ్రీ వేంకటేశ
వుపమించి చూడక నే నొక్కటైతిఁ గాక

(||pallavi||)
nerubarinaide nām̐ḍe ninninniḍā mĕppiṁchanā
vūrage ne mŏgamoḍi nuṁdānam̐ gāga

(||neru||)
maṁkudānanaide ninnu māḍalāḍa nittunā
biṁkabu dānanaidenu pĕchchu rem̐sanā
aṁkagattĕnaide gora nāyamu laṁṭiṁchanā
pŏṁka mĕṟam̐gaga ninnum̐ bŏdigem̐gāga

(||neru||)
paṁtagattĕnaide nīgu balumulu sūbanā
viṁtadānanaide ninnu vesariṁchanā
jaṁtadānivalĕnaide salamu sādiṁchanā
aṁtesi neraga nīgu nālanaidim̐ gāga

(||neru||)
kabaḍabu dāna naide kām̐kalanu muṁchanā
kaburuladānanaide gadi gūḍanā
yibuḍĕ nannum̐ gūḍidi vĕrim̐gi śhrī veṁkaḍeśha
vubamiṁchi sūḍaga ne nŏkkaḍaidim̐ gāga