నేరుపరి వవుదువు నీకే మమ్మ ఆతఁ
(॥పల్లవి॥)
నేరుపరి వవుదువు నీకే మమ్మ ఆతఁ
డీరాని చనవు లిచ్చె నిఁక నీకే మమ్మ
(॥నేరుపరి॥)
మావంటివారికె మన సియ్యఁడు గాక
నీవె ఆతఁడు గావా నీ కే మమ్మ
తోవల నీవును మాతో డట్టె సొలసే వాతఁ
డీవల నీయింట నున్నాఁ డిఁక నీ కే మమ్మా
(॥నేరుపరి॥)
మే మేమి చెప్పినాను మేరలు మీరుఁ గాక
నీ మాఁట దోయఁడు నీ కే మమ్మ
మోము చూచి మాకు మాకె మొగ మోడితిమి గాక
యేమర వాతని నీవు యిఁక నీ కే మమ్మా
(॥నేరుపరి॥)
వట్టి సట మా కైతె వరుస వం తిచ్చెఁ గాక
నెట్టుకొనె నిన్నతఁడు నీ కే మమ్మ
జట్టిగొని మమ్ముఁ గూడి సారె శ్రీవెంకటపతి
నిట్టె నీవుఁ గూడితిని యిఁక నీ కే మమ్మా
(||pallavi||)
nerubari vavuduvu nīge mamma ādam̐
ḍīrāni sanavu lichchĕ nim̐ka nīge mamma
(||nerubari||)
māvaṁṭivārigĕ mana siyyam̐ḍu gāga
nīvĕ ādam̐ḍu gāvā nī ke mamma
tovala nīvunu mādo ḍaṭṭĕ sŏlase vādam̐
ḍīvala nīyiṁṭa nunnām̐ ḍim̐ka nī ke mammā
(||nerubari||)
me memi sĕppinānu meralu mīrum̐ gāga
nī mām̐ṭa doyam̐ḍu nī ke mamma
momu sūsi māgu māgĕ mŏga moḍidimi gāga
yemara vādani nīvu yim̐ka nī ke mammā
(||nerubari||)
vaṭṭi saḍa mā kaidĕ varusa vaṁ tichchĕm̐ gāga
nĕṭṭugŏnĕ ninnadam̐ḍu nī ke mamma
jaṭṭigŏni mammum̐ gūḍi sārĕ śhrīvĕṁkaḍabadi
niṭṭĕ nīvum̐ gūḍidini yim̐ka nī ke mammā