Nerubari vauduve nelamta nee vinnidaanu

నేరుపరి వౌదువే నెలఁత నీ విన్నిటాను
Language

(॥పల్లవి॥)
నేరుపరి వౌదువే నెలఁత నీ విన్నిటాను
యీరీతుల రమణుని నెంత సేసేవే

(॥నేరు॥)
పనిలేనిమాటలను బయలు పందిలివెట్టి
మనసేమి సోదించేవే మగనిని
తవివోనిచూపులను తగులువిరులు వేసి
యెనసి పందేలాడేది యెందాఁకనే

(॥నేరు॥)
వాడికనవ్వులు చల్లి వలపువలువ దీసి
యేడదాఁకా మోసపుచ్చే వింత యేఁటికే
కోడెవయసుగరిడీఁ గొంకుదీర సాముసేసి
మేడెపురతుల నెంత మీరేవే యిపుడు

(॥నేరు॥)
వాములైన ప్రియములవడగండ్ల గుళ్లు గట్టి
గోమున శ్రీవేంకటేశుఁ గూడితి వవునే
దోమటి చేఁతలనే దొమ్మిసేసి మొక్కులాడి
దీములొడ్డి వేఁటలాడి తిరమైతివే

(||pallavi||)
nerubari vauduve nĕlam̐ta nī vinniḍānu
yīrīdula ramaṇuni nĕṁta seseve

(||neru||)
panilenimāḍalanu bayalu paṁdilivĕṭṭi
manasemi sodiṁcheve maganini
tavivonisūbulanu taguluvirulu vesi
yĕnasi paṁdelāḍedi yĕṁdām̐kane

(||neru||)
vāḍiganavvulu salli valabuvaluva dīsi
yeḍadām̐kā mosabuchche viṁta yem̐ṭige
koḍĕvayasugariḍīm̐ gŏṁkudīra sāmusesi
meḍĕburadula nĕṁta mīreve yibuḍu

(||neru||)
vāmulaina priyamulavaḍagaṁḍla guḽlu gaṭṭi
gomuna śhrīveṁkaḍeśhum̐ gūḍidi vavune
domaḍi sem̐talane dŏmmisesi mŏkkulāḍi
dīmulŏḍḍi vem̐ṭalāḍi tiramaidive