నేరుపరి వౌదువే నీవిన్నిటా
(॥పల్లవి॥)
నేరుపరి వౌదువే నీవిన్నిటా - వోరి
నేరకుంటే నేఁడు మమ్ము నీవింత సేతువా
(॥నేరు॥)
పూని మాఁటలాడఁగదే పొలఁతీ -వోరి
వాన పలుమారువైతే వరదలౌరా
నానితేఁ గొంత వలపు నయమౌఁగదే-వోరి
నానునా గొడ్డలివంటి నాలైన నీచిత్తము
(॥నేరు॥)
కలయవే మాపొత్తు కలికీ -వోరి
కలగలపు గిజ్జడి గాదటరా
పలురతులేకాదా పరిణామముఁ-వోరి
పలువంచలఁ బడెను పాయపు నీదేహము
(॥నేరు॥)
సేస వెట్టితిగదే శ్రీసతీ-వోరి
సేసుకుంటే పుణ్యములు చేరకుండునా
రాసులైతే మేలే నీ రచనలెల్లా -వోరి
ఆసలు శ్రీ వెంకటేశ ఆయములు సోఁకెరా
(||pallavi||)
nerubari vauduve nīvinniḍā - vori
neraguṁṭe nem̐ḍu mammu nīviṁta seduvā
(||neru||)
pūni mām̐ṭalāḍam̐gade pŏlam̐tī -vori
vāna palumāruvaide varadalaurā
nānidem̐ gŏṁta valabu nayamaum̐gade-vori
nānunā gŏḍḍalivaṁṭi nālaina nīsittamu
(||neru||)
kalayave mābŏttu kaligī -vori
kalagalabu gijjaḍi gādaḍarā
paluradulegādā pariṇāmamum̐-vori
paluvaṁchalam̐ baḍĕnu pāyabu nīdehamu
(||neru||)
sesa vĕṭṭidigade śhrīsadī-vori
sesuguṁṭe puṇyamulu seraguṁḍunā
rāsulaide mele nī rasanalĕllā -vori
āsalu śhrī vĕṁkaḍeśha āyamulu som̐kĕrā