Nerubari vauduve needagu raave | naagum

నేరుపరి వౌదువే నీడకు రావే । నాకుఁ
Language

(॥పల్లవి॥)
నేరుపరి వౌదువే నీడకు రావే । నాకుఁ
దారుకాణలాయ నిఁక తప్పులేలే

(॥॥)
కిన్నెరమీట్లలోని గిలిగింతలూ నీ-
సన్నలచాయలలోని చలివేండ్లు
వన్నెలకాఁకలమేనివసివాడుల నే-
మిన్నిటికి లోనైతి మిఁకనేలే పనులు

(॥॥)
జంకెనచూపులలోని సరిబేసులూ నీ-
తెంకులమాటలలోని తెల్లనల్లలు
కంకినగవులలోని కాయపండ్లు
మంకు లిన్నిటాఁ బడితి మరియేలే కతలు

(॥॥)
అచ్చపు సిగ్గులలోని అంగభంగాల నీ-
అచ్చుపడ్డకాఁగిటిలో నరమఱలూ
తచ్చి శ్రీ వేంకటపతిఁ దగిలి నేఁగూడితిని
యెచ్చుకుందులెల్లాఁ గంటి నిపుడేలే బొంకులూ

(||pallavi||)
nerubari vauduve nīḍagu rāve | nāgum̐
dārugāṇalāya nim̐ka tappulele

(||||)
kinnĕramīṭlaloni giligiṁtalū nī-
sannalasāyalaloni saliveṁḍlu
vannĕlagām̐kalamenivasivāḍula ne-
minniḍigi lonaidi mim̐kanele panulu

(||||)
jaṁkĕnasūbulaloni saribesulū nī-
tĕṁkulamāḍalaloni tĕllanallalu
kaṁkinagavulaloni kāyabaṁḍlu
maṁku linniḍām̐ baḍidi mariyele kadalu

(||||)
achchabu siggulaloni aṁgabhaṁgāla nī-
achchubaḍḍagām̐giḍilo naramaṟalū
tachchi śhrī veṁkaḍabadim̐ dagili nem̐gūḍidini
yĕchchuguṁdulĕllām̐ gaṁṭi nibuḍele bŏṁkulū