నేరుపరి వన్నిటాను నీవే యెఱుఁగుదువు
(॥పల్లవి॥)
నేరుపరి వన్నిటాను నీవే యెఱుఁగుదువు
కూరిములు తొల్లి మీకుఁ గొనసాగి వున్నవి
(॥నేరు॥)
చెప్పఁగల ప్రియములు చెప్పెఁజెలియ
ముప్పిరిఁ జేతులెత్తి మొక్కె నీకును
కప్పముగాఁ బట్టెఁ దన కమ్మని మోవి
యెప్పడు మన్నించేవో ఇఁకఁ జూచేము
(॥నేరు॥)
వలవఁగలట్టల్లా వలచె నింతి
మెలుపున జవ్వనము మిఁదెత్తె నీకు
నెలకొన్న చూపులను నివాళి యిచ్చె
చెలరేఁగి యెట్టు దయసేసేవో యిఁకను
(॥నేరు॥)
బెరసిన దాఁకాను పెనఁగెఁ గాంత
సరములనే సేస చల్లెనునీకు
యిరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
సరవితో నిఁక నెట్టు చనవువిచ్చేవో
(||pallavi||)
nerubari vanniḍānu nīve yĕṟum̐guduvu
kūrimulu tŏlli mīgum̐ gŏnasāgi vunnavi
(||neru||)
sĕppam̐gala priyamulu sĕppĕm̐jĕliya
muppirim̐ jedulĕtti mŏkkĕ nīgunu
kappamugām̐ baṭṭĕm̐ dana kammani movi
yĕppaḍu manniṁchevo im̐kam̐ jūsemu
(||neru||)
valavam̐galaṭṭallā valasĕ niṁti
mĕlubuna javvanamu mim̐dĕttĕ nīgu
nĕlagŏnna sūbulanu nivāḽi yichchĕ
sĕlarem̐gi yĕṭṭu dayasesevo yim̐kanu
(||neru||)
bĕrasina dām̐kānu pĕnam̐gĕm̐ gāṁta
saramulane sesa sallĕnunīgu
yiravai śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
saravido nim̐ka nĕṭṭu sanavuvichchevo